Weather Update: రాష్ట్రంలో పెరుగుతోన్న చలి..!
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగ మంచి ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు రాజధాని హైదరాబాద్ లో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది.
పలు ప్రాంతాల్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయింది. పగటి పూట వాతావరణం చల్లగా ఉండటంతో కరెంట్ వినియోగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వారం క్రితం గరిష్ఠ డిమాండ్ 3,300 మెగావాట్ల వరకు ఉంది. గురువారం హైదరాబాద్ 250 మెగావాట్ల వరకు డిమాండ్ తగ్గినట్లు వివరిస్తున్నారు. రాజేంద్రనగర్, సైబర్‌సిటీ, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలో వినియోగం తగ్గింది.

చలి పెరుగుతోన్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దుస్తులు చేతులు, కాళ్లు శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచేలా వేసుకోవాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని వివరిస్తున్నారు. రాత్రి పూట అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. వచ్చే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రెండు నెలలు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఏజేన్సీ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న ఐదురోజులపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంటుందని వివరించారు.












Click it and Unblock the Notifications