Inter Practical 2024: నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్..

తెలంగాణలో గురువారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్ నిర్వహిస్తుండగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ నిర్వహిస్తారు.

మొత్తం మూడు విడతల్లో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు మొదటి విడత నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండు దఫా, ఫిబ్రవరి 11 నుంచి 15 మూడో విడత ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, గురుకుల కళాశాలలకు చెందిన 3, 87,893 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

The inter-practical exams are going to start in Telangana from Thursday

ఇందులో 2,17,714 మంది ఎంపీసీ విద్యార్థులుండగా.. 1,04,089 మంది బైపీసీ విద్యార్థులు, 46,542 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.తెలంగాణ వ్యాప్తంగా 2,032 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను సంబంధితి కాలేజీలకు పంపినట్లు తెలిపింది. విద్యార్థులు కాలేజీల్లోని ప్రిన్సిపల్ వద్దకు వెళ్లి హాల్ టికెట్లు తీసుకోవాల్సిందిగా సూచించింది.

పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు తేల్చి చెప్పింది. డబ్బులు డిమాండ్ చేస్తే ఎగ్జామినర్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాలను అరగంట ముందు ఆన్ లైన్ పెట్టనున్నట్లు పేర్కొంది.. ఎగ్జామినర్ వచ్చి పాస్ వర్డ్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని డౌన్ లోడ్ చేస్తారని వివరించింది. ప్రాక్టికల్ పరీక్షల వాల్యుయేషన్ కూడా వెంటనే చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+