Telangana Elections 2023: అక్టోబర్ రెండో వారంలో కాంగ్రెస్, బీజేపీ తొలి జాబితా..!

తెలంగాణలో అక్టోబర్ 6 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ఎప్పటికే 115 మంది లిస్ట్ విడుదల చేసింది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో వంద మందితో కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సర్వేలపై కొందర నేతలు అధిష్ఠానికి ఫిర్యాదు చేయడంతో నియోజకవర్గాల్లో మరోసారి రీసర్వేకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

రీసర్వే ఇంకా కొనసాగుతోన్నట్లు తెలుస్తోంది. మంగళవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాణిక్ రావ్ ఠాక్రే ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ స్ట్రాటజీస్ట్ సునీల్ కనుగోలు కూడా పాల్గొనట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 8లోపు రీసర్వే పూర్తి చేయాలని సునీల్ కనుగోలును మాణిక్ రావ్ ఠాక్రే ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 6 జరగాల్సిన స్కీనింగ్ కమిటీ భేటీ 8 తేదీకి వాయిదా పడింది. 62 నియోజకవర్గాల్లో అభ్యర్థల ఎంపికపై ఏకాభిప్రాయం ఏర్పడింది.

The list of Congress and BJP MLA candidates is likely to be released in the second week of October

రీసర్వే తర్వాత 40 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 100 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన పర్యటనలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.

బీజేపీ కూడా అక్టోబర్ రెండో వారంలో అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కిషన్ రెడ్డి కలిశారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీఎస్పీ మంగళవారం సాయంత్ర మొదటి జాబితా ప్రకటించింది. సిర్పూర్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. జహీరాబాద్ నుంచి జంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉష, తాండూరు నుంచి చంద్రశేఖర్, దేవరకొండ నుంచి వెంకటేష్, చొప్పదండి నుంచి కొంకటి శేఖర్, పాలేరు నుంచి వెంకటేశ్వర రావు, నకిరేకల్ నుంచి ప్రియదర్శిని, వైరా నుంచి రాంబాబు నాయక్, ధర్మపురి నుంచి విజయ్ కుమార్, వనపర్తి రాములు, మానకొండూరు రామచంద్ర, కోదాడ శ్రీనివాస్, నాగర్ కర్నూల్ కుమార్, ఖానాపూర్ బాన్సీలాల్, అందోల్ ప్రకాశ్, సూర్యాపేట వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ క్రాంతి కుమార్, కొత్తగూడం ఎర్ర కామేష్, జుక్కల్ ప్రద్యాన్ కుమార్ పోటీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+