Cyber Crime: ముల్లును ముల్లుతోనే తీశాడు.. భార్యను వేధించినవాడిని పట్టుకున్నాడు..
ముల్లును ముల్లుతోనే తీయాలని ఒ సామెత ఉంది. దీన్ని ఓ వ్యక్తి నిజం చేస్తూ నిందితుడిని పట్టించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అతని భార్య ఉంది. అయితే కొద్ది రోజులుక క్రితం అతని భార్యకు ఓ అజ్ఞత వ్యక్తి అశ్లీల ఫొటోలను వాట్సాప్ చేశాడు. మొదటి లైట్ తీసుకున్నా ఆమె.. మళ్లీ ఫొటోలు పంపడంతో విషయాన్ని భర్తకు చెప్పింది.
అతను ఏమాత్రం తొందర పడకుండా.. భార్యకు ధైర్య చెప్పాడు. అతను ఎవరో కనుక్కుని పోలీసులు పటిస్తానని చెప్పాడు. అపరిచత వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా భర్త అతన్ని కనుక్కోవడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. యూట్యూబ్ లో చూసి, స్నేహితుల సలహాతో కొన్ని యాప్ ల్లో నిందితుడు ఫోన్ నంబర్ ఎంటర్ చేశాడు. అతని నంబర్ ఎవరు ఎన్ని రకాలుగా ఫీట్ చేసుకున్నారో గుర్తించారు. చివరికి నిందితుడి పేరు తెలుసుకున్నాడు.

ఆ తర్వాత నిందితుడి అడ్రస్ తెలుసుకున్నాడు. చివరికి నిందితుడు ఫొటో కూడా సంపాందించాడు. నిందితుడిది మెదక్ దగ్గర ఓ ఊరు అని తెలుసుకుని తన స్నేహితులతో అక్కడి వెళ్లాడు. ఆ గ్రామంలో నిందితుడి ఫొటో చూపించారు. ఎందుకు అని గ్రామస్థులు ప్రశ్నించగా.. అతనికి అప్పు ఇచ్చామని.. అతడు తిరిగి చెల్లించలేదని చెప్పారు. దీంతో నిందితుడు ఎక్కుడ ఉంటాడో గ్రామస్థులు చెప్పారు.
అతను సంగారెడ్డిలో నివసిస్తున్నట్లు చెప్పారు. అతడి అడ్రస్ తోపాటు బంధువుల ఫోన నంబర్లు కూడా ఇచ్చారు. దీంతో బంధువులకు ఫోన్ చేసి మీ బంధువు తమకు అప్పు చెల్లించేది ఉందని.. ఇప్పటి వరకు చెల్లించలేదని చెప్పారు. దీంతో నిందితుడిని తీసుకుని అతని బంధువులు సోమవారం సంగారెడ్డి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అయితే అప్పటికే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆధారాలు సమర్పించారు. నిందితుడు రాగానే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.












Click it and Unblock the Notifications