ప్రపంచంలోనే విషపూరితమైన తేలు.. ఒక్క చుక్క విషం 8 లక్షలకు పైనే!!

సాధారణంగా తేలు కుట్టిందంటే విలవిలలాడిపోతాం. కొన్ని రకాల తేళ్లు కుడితే కుట్టిన చోట నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ కూడా లేవని చెబుతారు. తేలుకి కొండిలో విషం ఉంటుంది. అయితే తేలు విషం చాలా ఖరీదు.. తేలు విషాన్ని అనేక వ్యాధులలో మెడిసిన్ కోసం ఉపయోగిస్తారు టీబీ తగ్గించడానికి క్యాన్సర్ వ్యాధుల నివారణకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గించడానికి తేలు విషం ఉపయోగపడుతుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విషం ఉన్న తేలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేలు విషం ఉంది. ఏ తేలు అత్యంత ఖరీదైన విషాన్ని కలిగి ఉంటుంది ఆ తేళ్లు ఎక్కడ ఉంటాయి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. మన భూమిపై అనేక విష జీవులు ఉంటాయి. వాటిల్లో తేళ్లు కూడా ఒకటి. తేళ్ళు అంటే ప్రజలు భయపడతారు కానీ ఆ తేళ్ల విషం మనకు పనికి వస్తుంది. మనల్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది.

The most poisonous scorpion in the world deathstalker scorpion One drop of poison is more than 8 lakhs

ఒక్క చుక్క విషం లక్షల్లోనే
ప్రస్తుతం మనం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన తేలు గురించి.. అత్యంత ఖరీదైన దాని విషాన్ని గురించి తెలుసుకుందాం. డెత్ స్టాకర్ స్కార్పియన్ అన్నది అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన తేలుజాతి. ఈ తేళ్ల యొక్క విషం ఒక మిల్లీలీటరు ఎనిమిది లక్షలకు పైగా ఉంటుంది. ఈ తేలు యొక్క విషం చాలా విలువైనది, అంతేకాదు ప్రమాదకరమైనది కూడా.

విషం తీసేటప్పుడు ఇలా చేస్తారు
డెత్ స్టాకర్ స్కార్పియన్ విషాన్ని తొలగించడానికి దాని స్టింగ్ కు తేలికపాటి విద్యుత్ షాక్ లు ఇస్తారు. దీని విషాన్ని తొలగించే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పొరపాటున ఈ విషం తొలగించే సమయంలో వ్యక్తిని కనుక కుడితే అతని ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. అందుకే దాని విషాన్ని అత్యంత జాగ్రత్తగా తొలగిస్తారు. డెత్ స్టాక్ స్కార్పియన్ ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఎడారులలో ఉండే తేళ్ళు.. మెడిసిన్స్ కు ఈ తేలు విషం డిమాండ్
ఈ తేళ్లు ఉత్తరాఫ్రికా నుండి మధ్య ప్రాచ్యం వరకు ఎడారులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ తేళ్లు మన భారతదేశంలో ఉన్న ధార్ ఎడారిలో కూడా కనిపిస్తాయి. రాజస్థాన్లో కొందరు ఈ తేలు యొక్క విషాన్ని తీసి విక్రయిస్తారు. సహజంగా దీని విషాన్ని క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సలో, అలాగే అలాగే బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచంలోని చాలా దేశాలలో డెత్ స్టాకర్ స్కార్పియన్ విషం నుంచి వివిధ రకాల మెడిసిన్స్ ను తయారు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+