ఆడపిల్ల.. ఆపై ఆనారోగ్యంతో పుట్టడంతో ఆసుపత్రిలో వదిలేసిన తల్లి...
ఆడపిల్ల పుట్టిందనగానే చాలామంది మొఖం చాటేస్తుంటారు. కొందరైతే ఆ బిడ్డను ఎక్కడో వదిలేస్తుంటారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో చోటుచేసుకుంది. ఆడపిల్ల.. ఆపై అనారోగ్యంతో పుట్టింది. దాంతో నవమోసాలు మోసిన తల్లే బిడ్డను వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని గాంధీ ఆసుప్రతిలో చోటుచేసుకుంది. చాలామంది ఆడపిల్లలను బరువుగా భావిస్తారు. అందుకే పుట్టగానే ఎక్కడో పడేయడం, వదిలేయడం వంటి దారుణాలకు పాల్పడుతారు. అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయాలి. ఆ పెళ్లిళ్లకు కట్నం ఇవ్వాలి. అందుకే ఆడపిల్ల ఎందుకు అనే ధోరణి చాలామందిలో ఉంటుంది. కానీ, నవమోసాలు మోసిన కన్నతల్లే అలా ఆలోచిస్తే.. మరి ఆడపిల్లల పరిస్థితి ఏంటీ..
అనారోగ్యంతో పుట్టిన ఆడపిల్ల...:మేడ్చల్ జిల్లా డబీల్‌పూర్‌కు చెందిన రేఖ అనే మహిళ ఈనెల 6వ తేదీ సాయంత్రం ప్రసవం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమె భర్త అలోక్‌సాహు కూడా వచ్చాడు. అయితే, రేఖ ఆడ్మిట్ అయిన రోజు సాయంత్రం ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డ బరువు తక్కువగా ఉంది. కేవలం 650 గ్రాముల బరువుతో మాత్రమే ఆ శిశువు పుట్టింది. దానికి తోడు పలు ఆనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే, వైద్యులు వెంటనే ఆ శిశువును ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్సలు చేయడం ప్రారంభించారు.

రెండురోజుల తర్వాత మృతిచెందిన శిశువు...:అయితే, ఈ దంపతులిద్దరూ ఆడపిల్ల పుట్టింది.. ఆపై ఎన్నో ఆనారోగ్య సమస్యలతో పుట్టింది అని ఆలోచించి.. ఎలాగైనా ఆ బిడ్డను వదిలించుకోవాలని అనుకున్నారు. ఆసుపత్రి సిబ్బందికి గానీ, వైద్యులకు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బిడ్డను వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ పసికందు రెండురోజులు ఐసీయూలో చికిత్స తీసుకుని ఈ నెల 8న కన్నుమూసింది. పాప మరణ వార్తను చెబుదామని తల్లిదండ్రులకు వైద్యులు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దాంతో వైద్యులే చివరికి ఆ పాప డెడ్‌బాడీని మార్చురీలో భద్రపరచడం జరిగింది. ఈ ఘటనపై గాంధీ ఆసుపత్రి ఆర్ఎంఒ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిలకలగూడ ఎస్ఐ తెలిపారు. పాప తల్లి రేఖపై 317 సెక్షన్ కింద కేసు పెట్టామని చెప్పారు. అయితే, పాప తల్లిదండ్రుల ఆచూకి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ పేర్కొ్నారు.












Click it and Unblock the Notifications