Loksabha Election 2024: బండ్ల, విజయశాంతికి దక్కని టికెట్..
ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేద్దామని సినీ పరిశ్రమకు చెందిన ఉత్సాహం చూపించారు. అయితే వారికి పార్టీలు హ్యాండ్ ఇచ్చాయని చెప్పొచ్చు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సెలబ్రెటీకి టికెట్ ఇవ్వలేదు. లోక్ సభ టికెట్ కోసం ఎవరెవరు ట్రై చేశారో చూద్దాం. తెలంగాణకు సంబంధించి బీజేపీ 17 స్థానాలకు 17 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక్కరు కూడా లేరు. ఇక కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ పార్టీ కూడా సినీ ప్రముఖులకు టికెట్ ఇవ్వలేదు.
ఇక బీఆర్ఎస్ 16 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. ఈ పార్టీ కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ హస్తం పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. విజయశాంతి మల్కాజిగిరి నుంచి టికెట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ కేటాయించింది.

దీంతో విజయశాంతి తీవ్ర నిరాశే మిగిలింది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. బండ్ల అసెంబ్లీ ఎన్నికల నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తనకు ఎంపీ టికెట్ కావాలని కోరినట్లు తెలుస్తోంది. కానీ హస్తం పార్టీ మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజు (వెంకట్రామ్ రెడ్డి) పేరు 2014 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజ్ మొదట కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. తాజాగా దిల్ రాజ్ కు బీజేపీ జహీరాబాద్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరో పక్క దిల్ రాజ్ తన అన్న నర్సింహారెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications