సింగిల్ గా వచ్చి కూల్ గా దోచేసే దొంగ పై పీడీ యాక్ట్
ఆ దొంగ సింగిల్ గా వస్తాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తాడు. గుట్టుచప్పుడు కాకుండా కూల్ గా దో చేస్తాడు. ఇక దోపిడి డబ్బుతో దర్జాగా బతికేస్తాడు. దొంగతనాలకు అలవాటుపడి, ఎన్నిసార్లు పట్టుబడినా , జైలుకెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోని ఓ దొంగపై పీడీ యాక్ట్ నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు.
మహారాష్ట్ర వాంఖడే కు చెందిన అమోల్ అశోక్ రావు వెల్డర్ గా పని చేస్తాడు.జల్సాలకు వ్యసనాలకు బానిసైన అతను డబ్బు కావాల్సి వచ్చినపుడల్లా తన సొంత రాష్ట్రం లో కాకుండా పక్క రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తాడు. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడిన ఈ కేటుగాడు తన వెంట తెచ్చుకునే బ్యాగ్‌లో స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, చిన్న ఇనుపరాడ్డు తెచ్చుకుంటాడు. ఇక పగలంతా నేను తిరిగి తాళం వేసిన ఇళ్లను చూసి రెక్కీ నిర్వహిస్తారు. అర్ధరాత్రి ఆ ఇళ్లలో దోపిడీకి పాల్పడతాడు . అందినకాడికి ఇంటిని గుల్ల చేస్తాడు.

తెలంగాణ రాష్ట్రంలో ఇతగాడు ఇప్పటికి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతేడాది 15 దొంగతనాలు చేశాడు. దీంతో అంతర్రాష్ట్ర ఘరానా దొంగగా గుర్తించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ పీడీయాక్టు నమోదు చేశారు. ఇక సదరు దొంగను ఈ ఏడాది మార్చిలో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ మారని కేటుగాడు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగిల్ గా, సింపుల్ గా దొంగతనాలు చేసే అశోక్ రావు ఇక కటకటాలు లెక్కించనున్నారు.
Recommended Video
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications