సుదర్శన్ రెడ్డి ఎంపిక వెనుక, కాంగ్రెస్ భారీ స్కెచ్ - జగన్, కేసీఆర్ 'ఫిక్స్'..!!

ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ అసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. ఎన్డీఏ ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ ను తమ అభ్యర్దిగా ప్రకటించింది. ఇండియా బ్లాక్ నేతలు తమ కూటమి అభ్యర్దిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డి పేరు ఖరారు చేసారు. ఈ ఎంపిక వెనుక కాంగ్రెస్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పుడు రెండు కూటముల నుంచి అభ్యర్ధులు ఖరారయ్యారు. తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

కీలక నిర్ణయం
ఉపరాష్ట్రపతి ఎన్నిక లో ఇండియా కూటమి తమ అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్దిగా ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ ను ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్‌ ను ప్రకటించటం ద్వారా దక్షిణాదికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలనేది ఎన్డీఏ ఆలోచనగా స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో ఇండియా బ్లాక్ సైతం ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడాలని నిర్ణయించింది. తొలుత రాధాకృష్ణన్‌ కు పోటీగా తమిళనాడు నుంచే మరో అభ్యర్ధి ని బరిలోకి దింపాలని భావించింది. అయితే, డీఎంకే అభ్యంతరాలు... రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని పోటీ చేయించాలనే మిత్రపక్షాల సూచనతో కాంగ్రెస్ నిర్ణయం మార్చుకుంది. ఇందులో భాగంగా అనూహ్యంగా సుప్రీం మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేసింది.

The reasons behind INDIA Bloc nominates judge B Sudershan Reddy for Vice President elections

ఎంపిక వెనుక
కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తిని తమ కూటమి అభ్యర్ధిగా ఉప రాష్ట్రపతి రేసులో నిలిపింది. ఈ అభ్యర్ధిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం. కర్ణాటక వైపు చూసినా.. తెలుగు వ్యక్తిని బరిలోకి దింపటం ద్వారా భవిష్యత్ సమీకరణాలకు మేలు చేస్తుందని కాంగ్రెస్ నేత లు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్ధిని ఏకగ్రీవంగా గెలిపించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అన్ని పార్టీలతోనూ మంత్రాంగం సాగిస్తోంది. ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్ధి బరిలో ఉండటం.. అందునా తెలుగు వ్యక్తి కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలకు సమస్యగా మారనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిగా ఉండటంతో ఆ మూడు పార్టీలు తమ అభ్యర్ది రాధాకృష్ణన్‌ కే మద్దతు ఇవ్వనున్నాయి.

The reasons behind INDIA Bloc nominates judge B Sudershan Reddy for Vice President elections

కేసీఆర్ - జగన్ నిర్ణయం
తెలంగాణ కు చెందిన సుదర్శన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం సుదర్శన్‌రెడ్డి స్వస్థలం. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. ఇక.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ జరగనుండటంతో.. బీఆర్ఎస్ నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ కు లోక్ సభలో ప్రాతినిధ్యం లేకపోయినా.. రాజ్య సభలో నలుగురు సభ్యులు ఉన్నారు. తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు ఇస్తారా లేదా అనే నిర్ణయం కోసం కాంగ్రెస్ వేచి చూస్తోంది. ఏ నిర్ణయం తీసుకున్నా.. భవిష్యత్ సమీకరణాలకు కీలకం కానుంది. అదే విధంగా ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతుగా నిలవాలని మాజీ సీఎం జగన్ ను బీజేపీ కోరింది. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు కావటంతో జగన్ ఎన్డీఏ వైపే నిలబడతారా.. తన ఆలోచన మార్పు చేసుకుంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు లక్ష్యంగా మారిన కేసీఆర్ - జగన్ ఇప్పుడు ఈ ఎన్నికలో తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+