మనదేశంలో అతి చిన్న రైలు... చెయ్యి ఎత్తితే ఆపుతారు

ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భవిష్యత్తులో మొదటి స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సింగిల్ ట్రాక్ ఉన్న ప్రాంతాల్లో డబుల్ లైన్లు, డబుల్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రద్దీని నివారించేందుకు ఈ లైన్ల నిర్మాణం జరుగుతోంది.

అత్యంత వేగంగా వెళ్లే రైళ్లతోపాటు అతి నెమ్మదిగా వెళ్లే రైళ్లు కూడా మనదేశంలో ఉన్నాయి. భారతీయ రైల్వే అంటేనే ఎన్నో వింతలు, విశేషాల సమాహారం. అత్యంత ప్రమాదకరమైన రైల్వే మార్గాలు కూడా ఉన్నాయి. మనదేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన రైలు గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ రైలుకు ఇటువంటి ప్రత్యేకత లేదు.

The smallest train in india It stops if you raise your hand

అతి చిన్న రైలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంచ్ నగర్ నుంచి జలౌన్ సర్సౌ మధ్య నడుస్తుంది. కేవలం ఈ రైలుకు మూడు బోగీలే ఉంటాయి. దీన్ని షటిల్ సర్వీస్ గా పిలుస్తారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మనం చెయ్యెత్తితే ఆగుతుంది. అలాగే లిఫ్ట్ కావాలన్నా బైక్, కారు ముందు చెయ్యెత్తుతాం. అలాగే ఈ రైలు ముందు కూడా చెయ్యెత్తితే వెంటనే ఆపుతారు. ఈ రెండు పట్టణాల మధ్య నడిచే ఈ షటిల్ రైలు మార్గమధ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సరే చెయ్యెత్తితో వెంటనే ఆగడమే దీని విశేషం. ప్రపంచంలో చెయ్యెత్తితే ఆగే రైలు ఇదొక్కటే.

బ్రిటీష్ కాలం నుంచి
ఈ సర్వీసు బ్రిటీష్ కాలంలో ప్రారంభమైంది. ప్రారంభంలో 13 కిలోమీటర్లే నడవడంతో నష్టాలు వచ్చేవి. దీంతో దీన్ని ఆపేశారు. స్థానికుల నుంచి ఈ రైలు కావాలంటూ డిమాండ్ ఎక్కువ కావడంతో పునరుద్ధరించారు. ప్రయాణాన్ని 46 కిలోమీటర్లకు పెంచారు. రెండు గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఎవరు చెయ్యెత్తినా ఆగుతుంది. కొంచ్ నుంచి సర్సౌకి రోజుకు రెండుసార్లు నడుస్తుంది. విద్యార్థులు, చిరు వ్యాపారులకు ఈ రైలు బాగా ఉపయోగపడుతుంది. టికెట్ ధరలు కూడా చాలా తక్కువ. రూ.10, రూ.15 మాత్రమే వసూలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+