Swathi: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. ప్రియురాలిని 20 ముక్కలు చేసిన ప్రియుడు..

శ్రద్ధా వాకర్ కేసు గుర్తుందా.. ఆమెను ప్రియుడే హత్యా చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. ఫ్రీజ్ లో పెట్టి రోజుకో బాడీ పార్ట్ బయట పడేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తల్లిదండ్రులను వదిలి వచ్చిన ఆమె తన ప్రియుడి చేతిలోనే హత్య గురయింది.కొద్ది రోజుల క్రితం బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి తన 25 ప్రియురాలిని హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి రిఫ్రీజిరేటర్ లో పెట్టి పరారయ్యాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.

అయితే ఇవ్వనన్ని ఎక్కడో జరిగాయి. కానీ అచ్చం ఇలాంటి ఘటనే మన దగ్గర జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి 20 ముక్కలు చేశాడు. ఆ ముక్కలను పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో జరిగింది. భానోత్ వీరభద్రం అనే వ్యక్తి పెళ్లైంది. అయితే అతను స్వాతి అనే 30 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు కలిసి ఉద్యోగం ఇప్పిస్తామని పలువురిని నమ్మించే ప్రయత్నం చేశారు.

The Swati incident at Bhadradri Kothagudem created a sensation across the state

ఆ క్రమంలో వారికి పార్వతి, రత్న కుమార్ అనే దంపతులు పరిచయం అయ్యారు. రత్నకుమార్ కు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని వీరభద్రం, స్వాతి నమ్మబలికారు. దంపతుల వద్ద రూ.16 లక్షలు తీసుకున్నారు. అయితే నెలలు గడిచినా రత్న కుమారు కు ఉద్యోగం రాలేదు. దీంతో వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని వీరభద్రం, స్వాతి పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ వారు పైసలు ఇవ్వలేదు. తాము అప్పు చేసి రూ.16 లక్షలు ఇచ్చామని.. తమ డబ్బు ఇవ్వాలని వేడుకున్నా వీరు కనికరించలేదు.

దీంతో పార్వతి, రత్నకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వీరభద్రం, స్వాతి విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబ సభ్యులు వీరభద్రం, స్వాతి ఇంటి ముందు ఆందోళన చేశారు. చివరికి తీసుకున్న రూ.16 లక్షలు తిరిగి ఇస్తామని స్వాతి చెప్పింది. ఆ తర్వాత వీరభద్రాన్ని డబ్బు ఇవ్వాలని.. మన వల్ల కుటుంబం అన్యాయం అయిందని పేర్కొంది. స్వాతి ఒత్తిడి పెరిగిపోవడంతో వీరభద్రం ఓ ప్లాన్ వేశాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.

స్వాతిని ఓ చోటికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మటన్ కట్ చేసే కత్తితో 20 ముక్కలు చేశారు. ఆ ముక్కలను గోనె సంచిలో వేసి పొలంలో పాతిపెట్టాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. వారు ఘటన స్థలానికి వచ్చారు. మృతదేహం భాగాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం పంపారు. ప్రస్తుతం నిందితుడు వీరభద్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఈ ఘటన కొమ్ముగూడెంలో సంచలనంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+