హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Chain Snatching: చైన్ స్నాచింగ్ చేసిన దొంగలెక్కడా..! వారు ఎలా తప్పించుకున్నారు..!

|
Google Oneindia TeluguNews

గత శనివారం ఉదయం వరస చైన్ స్నాచింగ్ లతో హడలెత్తించిన దొంగలు ఇంకా పట్టుబడలేదు. మొదటగా ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలు చేశారు. ఉప్పల్‌ పరిధిలోని రాజధాని థియేటర్ ప్రాంతంతో పాటు కల్యాణ్‌పురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, హబ్సిగూడలోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులులాక్కెళ్లారు. ఇదంతా గంటలో చేశారు.

వాహనం చోరీ

వాహనం చోరీ

దొంగలు మొదటగా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి దానితోనే దొంగతనాలకు పాల్పడ్డారు. తొలుత ఉప్పల్‌ చౌరాస్తా సమీపంలో ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లారు. ఆ వెంటనే కల్యాణిపురి కాలనీలో ఓ వృద్ధురాలి గోలుసును లాక్కుపోయారు. ఆ తర్వాత హబ్సిగూడ రవీంద్రనగర్‌లో జానకమ్మ అనే వృద్ధురాలి మెడలోంచి మరో గోలుసు కొట్టేశారు. ఇలా 6 చోట్ల చైన్ స్నాచింగ్ పాల్పడ్డారు.

కాచిగూడ ర్వైల్వేస్టేషన్

కాచిగూడ ర్వైల్వేస్టేషన్

అనంతరం ప్యాడైజ్ కు చేరుకుని అక్కడ ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు. అక్కడ ఆటో తీసుకుని కాచిగూడ ర్వైల్వేస్టేషన్ కు చేరుకున్నారు. ఈ వరస దొంగతానాల్లో నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా యూపీకి చెందిన వారిగా నిర్ధారించారు. దొంగలు కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వారు వరంగల్ వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. ఖాజీపేట వెళ్తున్నట్లు అనుమానించి తనిఖీలు చేశారు. కానీ దొంగలు తప్పించుకున్నారు.

బెంగళూరు

బెంగళూరు

ఈ దొంగలు ఇప్పటికే రాష్ట్రం విడిచిన వెళ్లినట్లుగా తెలిసింది. దీంతో రెండు పోలీసుల బృందాలు యూపీ వెళ్లాయి. కానీ దొంగలు వారి స్వస్థలాలకు వెళ్లలేదని తేలింది. ఈ చైన్ స్నాచింగ్ చేసిన వారు ముందు రోజు అంటే శుక్రవారం బెంగళూరులో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ దొంగల కోసం కర్ణాటక, తెలంగాణ పోలీసులు వెతుకుతున్నారు.

English summary
Chain snatchings took place in Hyderabad last Saturday. Police are hunting for the accused of chain snatching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X