భర్త అక్రమ సంబంధం.. భార్యకు కోపం.. కెమెరాల సాక్షిగా ఇద్దరిని చితక్కొట్టిందిగా..! (వీడియో)
Recommended Video
కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ మాత్రమే కాదు సహనంలో సీతగా కూడా భార్యకు చాలా మంచి స్థానం ఉంది. అటువంటి భార్యను పట్టించుకోకుండా భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకుంటే.. తనను కాదని, వేరొక వివాహితతో కలిసి కాపురం పెడితే ఏం చేస్తుంది.. భార్యకు సహనం నశిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది. హైదరాబాద్ ప్రగతినగర్ లో జరిగిన ఈ ఘటన భార్య సహనం కోల్పోతే ఏం జరుగుతుందో అర్థమయ్యేలా చెబుతుంది.

పెళ్లై కొడుకు పుట్టాక ... మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త ..
హైదరాబాద్ లో నివాసముంటున్న లక్ష్మణ్ ,సౌజన్య లకు 2010లో వివాహం జరిగింది. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లా కొత్త కొమ్ముగూడెం. సజావుగా సాగిన వీరి దాంపత్యానికి ప్రతీకగా ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత ఒక వివాహితతో పరిచయమై ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఏకంగా కాపురమే పెట్టాడు లక్ష్మణ్. లక్ష్మణ్ తో కలిసి ఉంటున్న మహిళ అనూషకు కూడా రవికాంత్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే భర్తను వదిలిపెట్టిన సదరు మహిళ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లోని ప్రగతి నగర్ లో లక్ష్మణ్ తో కలిసి జీవిస్తోంది.

లక్ష్మణ్ , అనూషల వ్యవహారం తెలిసి రెండేళ్లుగా బాధ అనుభవిస్తున్న సౌజన్య
కట్టుకున్న భార్య ని, కన్న కొడుకును వదిలిపెట్టి పరాయి మహిళలతో సంబంధం పెట్టుకొని ఏకంగా అక్కడే ఉంటున్న లక్ష్మణ్ , అనూషల వ్యవహారం భార్య సౌజన్య కు తెలిసి భర్తను నిలదీసింది. వారిద్దరూ దిగిన ఫోటోలను చూపించి భర్తను ప్రశ్నించింది . అయితే లక్ష్మణ్ అది గతంలో దిగిన ఫోటోలని ప్రస్తుతం అలాంటివేవీ తాను చేయడంలేదని భార్యకు చెప్పారు. తన భర్త తనను కాదని మరో వివాహితతో రెండేళ్లుగా సాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని తెలుసుకున్న భార్య ప్రగతి నగర్ లోని ఒక ఇంట్లో వారిద్దరూ కాపురం పెట్టిన సంగతి తెలిసి అక్కడికి వెళ్లారు.

సహనం నశించి భర్తను చితకబాదిన భార్య .. పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
లోపల భర్త లక్ష్మణ్, అనూష ఉండడంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. సహనం నశించిన ఆ ఇల్లాలు భర్తను చితకబాదింది. తనేం తప్పుచేశానంటూ నిలదీసింది. తనకు, తన కొడుకుకు అన్యాయం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించింది. సంవత్సరాలుగా సాగుతున్న వివాహేతర సంబంధంతో ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకొని భర్తను చితగొట్టేలా చేసింది. అంతేకాదు తమ బంధువులను,మీడియాని తీసుకెళ్ళి మరి భర్త అక్రమ సంబంధ బాగోతాన్ని రట్టు చేసింది.
ప్రస్తుతం వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. మరి పోలీసులు ఈ భార్య భర్తల పంచాయతీని ఎలా తేలుస్తారో ...












Click it and Unblock the Notifications