TSPSC Paper Leak : టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో నిందితురాలు రేణుక సర్టిఫికేట్లు ఫేకా..!
టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ కేసులో నిందితురాలు రేణుకపై పలు ఆరోపణలు వస్తున్నాయి.
టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు. ఆమె 2018 టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆమె సంక్రమంగానే రిక్రూట్ అయిందా.. ఆమెకు కూడా ప్రవీణ్ పేపర్ లీక్ చేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి.
రాథోడ్ రేణుక గురించి విచారణ చేయగా ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఆమె తల్లి లక్ష్మీభాయి మన్సూర్ పల్లి బీఆర్ఎస్ సర్పంచ్ గా ఉన్నారు. రేణుక తన సోదరుడు రాజేశ్‌నాయక్‌తో పాటు మన్సూర్‌పల్లి తండాకే చెందిన నీలేశ్, శ్రీను, వికారాబాద్ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌కు కూడా ఏఈ ప్రశ్నపత్రం డబ్బులు తీసుకుని లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

వీరు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున రేణుకకు ముట్టజెప్పినట్లు తెలిసింది. రేణుక ఈ సంవత్సరం 12 సెలవులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. జనవరి 3 సెలవులు తీసుకోగా.. ఫ్రిబవరిలో మూడు లీవ్ లు తీసుకున్నారు. మార్చిలో ఏకంగా 6 సెలవులు పెట్టారు. ఆమె ఏఈ పరీక్ష ముందు, పరీక్ష రోజు, తర్వాతి రోజు సెలవు తీసుకున్నట్లు సమాచారం. ప్రవీణ్ తో రేణుకకు సన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది. అందుకే ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు గుర్తించారు.
కాగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రవీణ్ మొబైల్ ఫోన్ కీలక ఆధారాలు గుర్తించారు పోలీసులు. అతను 46 మంది అమ్మాయిలతో న్యూడ్ కాల్ మాట్లాడినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications