నగర కాలనీల్లో కనీస వసతులు లేవు.!గులాబీ ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.!
సికింద్రాబాద్/హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తీర్చడంతో పాటు అభివృద్ధి పనులపై దృష్టిపెట్టినట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన శనివారం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో 90 లక్షల రూపాయలతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాను. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తాను ప్రజల ఇబ్బందులు తీర్చడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగర పర్యటన.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి అసంతృప్తి : సికింద్రాబాద్ పార్లమెంట్నియోజకవర్గంలోని అన్ని పీహెచ్‌సీల్లో ఎంపీ ల్యాడ్స్ ద్వారా అదనపు వసతులు కల్పించినట్లు తెలిపారు. అనేక బస్తీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం సహా, తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గోల్కొండ కోటకు, చార్మినార్‌ల వద్ద శాశ్వతంగా లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని పర్యాటకంగా డెవలప్ చేస్తామన్నారు. ప్రధాని మోడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో కరోనా తొలగి పోనందున, మాస్కులు పెట్టుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని కేంద్ర మంత్రి సూచించారు.

అప్పుల కుప్పగా జీహెచ్ఎంసీ .. ప్రభుత్వానిదే బాద్యతన్న కేంద్ర మంత్రి :అంతే కాకుండా కాలనీల్లో కనీస వసతులు లేవని, ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు అప్పుల్లో ఉందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో బస్తీల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు మృగ్యంగా మారిపోయాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, నగర బస్తీల్లో కనీస వసతులు కల్పించడం లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న జీహెచ్ఎంసీ రాష్ట్ర సర్కారు తీరుతో అప్పులపాలైందని విమర్శించారు.
సౌకర్యాలు దారుణం.. గులాబీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమన్న కిషన్ రెడ్డి :ఈ మేరకు కిషన్ రెడ్డి నాంపల్లిలోని గుడిమల్కాపూర్ డివిజన్ షాద్‌నగర్ కాలనీలో 44 లక్షల రూపాయలతో చేపట్టే వీడీసీసీ రోడ్, వాటర్ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా కాలనీ వాసులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పటికీ, ఆ మేరకు బస్తీల్లో ఖర్చు చేయడం లేదన్నారు. బిల్లులు రాక ఇటీవల 700 మంది కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు ధర్నా చేశారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

రహదారులు బాగుంటే సరిపోదు.. కాలనీ రోడ్లు బాగుండాలన్న కిషన్ రెడ్డి :హైటెక్ సిటీ, పాత బస్తీలు, కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. మెయిన్ రోడ్లు బాగుంటే సరిపోదని, కాలనీల్లో అన్ని వసతులు ఉండాలన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కాలనీల్లో నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలనీల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు. బస్తీవాసులకు తాను అండగా ఉంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ సెగ్మెంట్లో అభివృద్ధి కొనసాగుతున్నదని, గోల్కొండ, చార్మినార్ వద్ద శాశ్వత లైటింగ్, సౌండ్ సిస్టమ్ ను కొనసాగిస్తామన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications