ఆ వార్తల్లో నిజం లేదు: కొండా సురేఖ
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొందరు కావాలనే కుత్రపూరితంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానానికి భక్తులు సమర్పించిన కోడెల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతో.. వాటిలో కొన్ని మరణించాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే మొక్కుల రూపంలో భక్తులు రాజరాజేశ్వర స్వామికి సమర్పించిన కోడెల నిర్వహణకు విధివిధానాలను రూపొందించేందుకు మే నెలలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు.

ఈ మార్గదర్శకాలను పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, సంబంధిత మండల వ్యవసాయ అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రాలు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఒక రైతుకు రెండు కోడెల చొప్పున ఇస్తున్నామని మంత్రి సురేఖ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సిరిపడా షెడ్లు, తాగునీటి వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వివరించారు.
తమ ప్రభుత్వం గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణ చేపడుతున్న క్రమంలో కోడెలను అక్రమంగా విక్రయించారంటూ వచ్చిన వార్తలు వట్టి వదంతులేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సాధారణంగా తన వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు సూచిస్తుంటామన్నారు. అదే విధంగా కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా పంపించినట్లు కొండా సురేఖ తెలిపారు.
దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే రైతులకు కోడెలను పంపిణీ చేశారని కొండా సురేఖ తెలిపారు. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానంలోని ప్రతి కోడెకు శాశ్వతమైన ట్యాగ్ ఉంటుందని, అటువంటి ట్యాగులున్న కోడెలు ఎక్కడా పట్టుబడలేదని చెప్పారు.
ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలను వెల్లడిస్తూ శుక్రవారం రాజరాజేశ్వర దేవస్థానం ఈవో స్పష్టనిచ్చారని చెప్పారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నదంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. సమాజంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి, చట్టపరంగా చర్యలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications