వైన్ షాపులో దొంగతనం: షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన దొంగ
హైదరాబాద్: దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగ షట్టర్ మధ్యలో ఇరుక్కుపోయిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లోని రంగ సాయి వైన్స్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఓ దొంగ పుల్లుగా మద్యం సేవించి మద్యం షాపులోనే చోరీకి యత్నించాడు. షట్టర్ తెరుచుకుని షాపులోకి వెళ్లేందుకు యత్నించగా అనుకోని పరిణామాల్లో అతడు వైన్ షాపు షట్టర్‌లో ఇరుక్కుపోయాడు. షట్టర్ మధ్యలో ఇరుక్కుని బయటకు రాలేక పెద్దగా కేకలు పెట్టసాగాడు.

దీంతో అక్కడికి వచ్చిన స్ధానికులు అతడిని రక్షించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వైన్ షాపులో చోరీ కోసమే అతడు వచ్చాడంటూ స్థానికులు, యాజమాన్యం చెబుతుండగా, మద్యం కోసమే వచ్చానని ఆ దొంగ చెబుతున్నాడు.
ఈ విషయాల్లో ఏది నిజమో తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దొంగను తాండూరు మండలానికి చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications