రూ. కోటి వజ్రాల ఆభరణాల చోరీ: పనిమనుషుల పనే
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని లంగర్‌హౌజ్‌లోని సాలార్‌జంగ్ కాలనీలో గల పారిశ్రామికవేత్త ఇంట్లో కోటి రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు, నగదు దొంగిలించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం ఉప కమిషనర్ ఎ.వెంకటేశ్వరరావు, అదనపు ఉపకమిషనర్ నాగరాజుతో కలిసి శుక్రవారం వెల్లడించారు.
బీహార్‌కు చెందిన అన్‌మోల్, కిషన్ కొన్నాళ్లక్రితం బంజారాహిల్స్‌లోని అంబేద్కర్‌నగర్‌లో స్థిరపడ్డాడు. ఇలా స్థిరపడిన బీహారీలకు అదే రాష్ట్రానికి చెందిన ముఖేష్ ఉపాధి చూపిస్తుంటాడు. దీనికి సంబంధించి ఆయన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఈ విధంగా అన్‌మోల్, కిషన్‌ను సాలార్‌జంగ్ కాలనీలోని సుజిత్ అగర్వాల్ ఇంట్లో పనికి పెట్టాడు. అన్‌మోల్ వంట మనిషిగా, కిషన్ సహాయకుడిగా పనిలో చేరారు. కొన్నాళ్ల క్రితం సుజిత్‌తో గొడవపడి వారు పనిమానేశారు. అప్పటినుంచి ఈ ఇంటిపై కన్నేసిన ఇద్దరూ అవకాశం కోసం ఎదురు చూశారు.
డిసెంబర్ 31వ తేదీ సుజిత్ కుటుంబసభ్యులు నూతన సంవత్సర వేడుకలకు వెళ్లారు. ఇదే అదనుగా భావించారు. ఆటోలో సుజిత్ ఇంటికి వచ్చారు. గోడ దూకి పక్కింట్లోకి ప్రవేశించారు. ఆ భవనం పైనుంచి నిచ్చెన ద్వారా దిగి సుజిత్ ఇంట్లోకి ప్రవేశించారు. కిటికీ గ్రిల్స్ తొలగించి వంటగదిలో నుంచి పడక గదిలోకి ప్రవేశించారు. వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. సుజిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన లంగర్‌హౌజ్ పోలీసులు ఇంతకుముందు ఇంట్లో పనిచేసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెంట్ ముఖేష్‌ను ప్రశ్నించగా అన్‌మోల్, కిషన్ బీహార్ వెళ్లిపోయారని చెప్పాడు.
ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించిన పోలీసులు పక్కా సమాచారంతో అన్‌మోల్, కిషన్‌ను పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును అన్‌మోల్ మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్న తండ్రి వద్ద భద్రపరిచాడు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మొత్తం లక్ష రూపాయల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఇప్పటి వరకు ఎటుంటి కేసులు నమోదు కాలేదని ఉపకమిషనర్ వెంకటేశ్వరరావు చెప్పారు. నిందితులకు, ఔట్‌సోర్సింగ్ ఏజెంట్‌కూ సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించడానికి పోలీసు కస్టడీకి తీసుకుంటామన్నారు.

దొంగల పట్టివేత
హైదరాబాదులోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో వజ్రాలు పొదిగిన అభరణాలను, నగదును దొంగిలించినవారిని పోలీసులు పట్టుకున్నారు.

దొంగల పట్టివేత
హైదరాబాదులోని లంగర్‌హౌస్ సాలార్ జంగ్ కాలనీలోని ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో కోటి రూపాయల విలువ చేసే నగలను, నగదును దొంగిలించినవారు పోలీసులకు చిక్కారు.

ఇద్దరిని పట్టుకున్నారు..
పారిశ్రామికవేత్త ఇంట్లో పనికి కుదిరినవారే నగలు, నగదు దొంగతనానికి పాల్పడినట్లు హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు గుర్తించారు.

నిందితుల గురించి..
దొంగతనం జరిగిన తీరును హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి వెంకటేశ్వ రావు, అదనపు డిసిపి నాగరాజుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు.

పని మానేశాక..
పారిశ్రామికవేత్త ఇంట్లో కొంత కాలం పనిచేసి ఆ తర్వాత పని మానేసిన కిషన్, అన్‌మోల్ అదును చూసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బీహార్ వెళ్లిపోయారు...
పారిశ్రామికవేత్త ఇంట్లో అన్‌మోల్, కిషన్‌ను పనికి పెట్టిన ముఖేష్‌ను ప్రశ్నిస్తే వారిద్దరు కూడా బీహార్ వెళ్లిపోయినట్లు చెప్పాడు.

అపార్టమెంటులో దాచి పెట్టారు.
ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించిన పోలీసులు పక్కా సమాచారంతో అన్‌మోల్, కిషన్‌ను పట్టుకున్నారు. దొంగిలించిన సొత్తును అన్‌మోల్ మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఉంటున్న తండ్రి వద్ద భద్రపరిచాడు.












Click it and Unblock the Notifications