దంపతుల దృష్టి మరల్చి 5లక్షల దోపిడీ: ఫిర్యాదు

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ బిగ్‌బజార్ సమీపంలో బైకుపై వెళ్తున్న దంపతుల దృష్టి మరల్చిన దొంగలు వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నారు. 59 లక్షల రూపాయలను దొంగలు దోచుకెళ్లినట్లు బాధిత దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏటిఎం చోరీకి విఫలయత్నం

హైదరాబాద్ నగరంలోని ఎస్సార్‌నగర్‌లోని సెంట్రల్ బ్యాంకు ఏటిఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటిఎం యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా అది సాధ్యంకాకపోవడంతో దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు.

Thieves theft 5 lakhs from a couple

డబ్బులు డ్రా చేసేందుకు ఏటిఎంకు వచ్చిన వ్యక్తులు ఏటిఎం మిషన్ దెబ్బతిని ఉండటంతో విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఏటిఎం సెంటర్‌‌కు చేరుకుని, సిసి ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఘటనపై బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హెరిటేజ్‌పాలు నేలపాలు చేసిన ట్రేడ్ యూనియన్ నేతలు

ప్రజల ఆరోగ్యానికి హానికరమని తెలిసినప్పటికి రసాయనాలను కలిసి స్వచ్ఛమైన పాలను కల్తీచేస్తున్న హెరిటేజ్‌ లాంటి సంస్థలను వెంటనే తెలంగాణాలో రద్దు చేయాలని తెలంగాణ ట్రేడ్‌యూనియన్ సెల్ అధ్యక్షులు, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతె శోభన్‌రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం లాలాపేట్ ఎపి డైరీ నుంచి తార్నాక చౌరస్తావరకు వందలాది మందితో టిటియుసి అనుబంధ సంస్థ అయిన విజయడైరి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తాలో హెరిటేజ్‌పాల ప్యాకెట్‌లను చించి పాలను కిందపారబోసారు. ఆ తర్వాత ఏపి సిఎం చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను దగ్థం చేశారు.

ఈ సందర్భంగా శోభన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నన్ని రోజులు ఒకవైపు రైతులను మరోవైపు ప్రజలను ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయడైరీని ఘోరంగా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+