Dubai: దుబాయ్ లో తెలంగాణ వాసి మృతి..
హోలీ పండుగ రోజు వరంగల్ లో విషాదం నెలకొంది. వరంగల్ కు చెందిన తిరుమలేష్ సోమవారం దుబాయిలో గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఉపాధి కోసం తిరుమలేష్ దుబాయ్ వెళ్లారు. సోమవారం ఉదయం అతనిక గుండెలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అతని సహచరులు తిరుమలేష్ మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
తిరుమలేష్ మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిరుమలేష్ స్వస్థలం ఉనికిచర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ ఉపాధి లేక అప్పు చేసి దుబాయ్ వెళ్లిన తిరుమలేష్ గుండె పోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అతను కొద్ది రోజుల క్రితమే దుబాయ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. అతని మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇందుకో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలేష్ మృతిపై కూడా స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుమలేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ నుంచి చాలా మంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి అరబ్ దేశాలకు వెళ్తుంటారు.
గతంలో కూడా తెలంగాణకు చెందిన కొందరు దుబాయ్, సౌదీల్లో మృతి చెందారు. అయితే వారి మృతదేహాలను తీసుకురావడానికి సమయం పట్టేది. ఈ మధ్య భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవడంతో విదేశాల్లో మృత చెందిన భారతీయల మృతదేహాలను త్వరగా స్వదేశానికి వస్తున్నాయి.












Click it and Unblock the Notifications