హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్ సాహసోపేతమైన అనూహ్య నిర్ణయం వెనుక
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును కూడా ఎల్ అండ్ టీ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఒప్పుకుంది. ఎల్ అండ్ టి వంటి ప్రైవేట్ దిగ్గజం హైదరాబాద్ మెట్రోను నిర్వహించడం మా వల్ల కాదని చేతులెత్తేస్తే, ఎందుకు తెలంగాణలోని రేవంత్ సర్కార్ హైదరాబాద్ మెట్రో టేకోవర్ చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మొదటి నుండి నష్టాల బాటలోనే హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో పిపిపి పద్ధతిలో నిర్మాణం జరిగిన మెట్రో, అయితే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు ఎల్ అండ్ టి ముందుకు వచ్చింది. మొదటిదశ మెట్రో రైల్ సర్వీస్ నిర్మాణం 2020 ఫిబ్రవరి 7వ తేదీన పూర్తికాగా మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశలో 3కారిడార్లు నిర్మాణం జరిగింది. మెట్రో రైల్వే ప్రాజెక్టును నిర్మాణం చేసిన ఎల్ అండ్ టి సంస్థ మొదటి నుంచి నష్టాలను చవి చూసింది.

హైదరాబాద్ మెట్రోతో ఆది నుండీ ఎల్ అండ్ టీ కి కష్టాలే
ఇప్పటివరకు ఆ నష్టాల నుండి బయటపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎల్ అండ్ టి కోలుకోలేదు. మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు ఆలస్యంగా జరగడం వల్ల, వ్యయం పెరగడం వల్ల 2017 మార్చిలో 3756 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్ అండ్ టి సంస్థ కోరింది. ఇకఆ ఆర్థిక భారం 2020 ఫిబ్రవరి నాటికి ఐదు వేల కోట్లకు చేరుకుంది.
మెట్రో రెండో దశ నిర్మాణం కోసం కేంద్రానికి తెలంగాణా ప్రతిపాదనలు
ఆ ఆర్థిక భారం నుండి ఇంకా ఎల్ అండ్ టి బయటపడలేదు. ఇదే సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రెండవ దశను పార్ట్ ఏ, పార్ట్ బీ గా విభజించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతో, ఎల్ అండ్ టి సంస్థ దానిని తాము నిర్మించ లేమని, నిర్వహించలేమని చేతులెత్తేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రెండవ దశ నిర్మాణానికి సన్నద్ధమైంది .
తెలంగాణా ప్రభుత్వ ప్రతిపాదన నిరాకరించిన ఎల్ అండ్ టీ
కేంద్రం మొదటి దశ ప్రైవేటు నిర్వహణలో, రెండవ దశ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించడంతో రెండింటినీ కలుపుకొని జాయింట్ అగ్రిమెంట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం చెప్పింది. ఇది జరిగితేనే అనుమతులు ఇవ్వగలమని ప్రకటించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టి సంస్థతో ఈ విషయంలో సంప్రదింపులు జరపగా వారు జాయింట్ వెంచర్ లో భాగస్వామ్యం తీసుకోవడానికి ఒప్పుకోలేదు.
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
దీంతో మొదటి దశ కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ దశను, మొదటి దశను కలిపే విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయని భావిస్తోంది. హైదరాబాద్ మెట్రో రెండవ దశ నిర్మాణం కోసం ఎల్ అండ్ టి వెనక్కు తగ్గడంతో మొత్తం మెట్రో రైలు ప్రాజెక్టును టేకోవర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
రేవంత్ సర్కార్ నిర్ణయం వెనుక కారణమిదే
ఈ టేకోవర్లో భాగంగా దాదాపు 13వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వమే భరించడానికి అంగీకారాన్ని తెలిపింది. అదనంగా 2100కోట్ల రూపాయల నగదును ఎల్ అండ్ టి సంస్థకు చెల్లించడానికి ఒప్పుకుంది. లాభాలు రాకపోగా, తీవ్రమైన నష్టాలలో ఉన్న మెట్రోరైలు ప్రాజెక్టును నిర్వహించలేమని ఎల్ అండ్ టీ సంస్థ చెప్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో అవసరాన్ని మెట్రో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రోను టేకోవర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
రేవంత్ సామర్ధ్యానికి అగ్ని పరీక్ష
ఇది రేవంత్ సామర్ధ్యానికి అగ్నిపరీక్ష వంటిదేనని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో రైలు సర్వీస్ ఉన్న పరిస్థితుల్లో రెండవ దశ విస్తరణకు ఎల్ అండ్ టీ ముందుకు రాకపోవడంతో మెట్రో విస్తరణ ఆగకుండా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇది కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇది తెలంగాణ ప్రభుత్వం పై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతుందా? రేవంత్ సర్కార్ దీనిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతుందా? అన్నది ముందు ముందు తెలియనుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications