ఏ క్షణంలోనైనా హతమారుస్తామంటూ బెదిరించారు: బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్: తనను హతమారుస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపులకు గురిచేస్తున్నారని భారతీ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నువ్వు ఎక్కడున్నావ్? నిన్ను ఈ క్షణంలోనే హతమారుస్తాం. అందుకు అవసరమైన యంత్రాంగమంతా సిద్ధంగా ఉంది. నీ అంతు చూడటమే మా లక్ష్యం' అంటూ బెదిరింపులకు గురిచేశారని చెప్పారు.
ఆదివారం సాయంత్రం 6.52 నిమిషాలకు తనకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని రాజాసింగ్ తెలిపారు. ఈ మేరకు బెదిరింపులు వచ్చాయని రాష్ట్ర డిజిపి, సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

+ 101317482440 నంబర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌కు సంబంధించిన డేటాను పోలీసు శాఖకు అందజేశానని, ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని రాజాసింగ్ తెలిపారు. ఇప్పటి వరకు తనకు పదికిపైగా ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఏ ప్రభుత్వం కూడా స్పందించడం లేదని చెప్పారు.
గతంలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, ఇరాన్, ఇతర దేశాల నుంచి కూడా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని గుర్తు చేశారు. హిందూ ధర్మ రక్షణ, గోరక్ష కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని రాజాసింగ్ స్పష్టం చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications