ఐసిస్‌లో చేరడానికే నాగపూర్: శ్రీనగర్ టూ సిరియా

హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరడానికే నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళ్లాలని అనుకున్నామని, అక్కడినుంచి సిరియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) అధికారుల విచారణలో నిందితులైన ఇంజనీరింగ్ విద్యార్థులు అంగీకరించారు. చంచల్‌గూడలో ముగ్గురు విద్యార్థులను సిట్ అధికారులు మూడు రోజులుగా విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన బాసిత్, ఫారూఖ్, ఒమర్ హసన్ గతనెల డిసెంబర్ 25న సిరియా వెళ్ళేందుకు బయలుదేరి నాగపూర్ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఉగ్రవాద భావజాలానికి ప్రభావితులమై ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాద సంస్థలో చేరాలని నిశ్చయించుకున్నామని, చాలామందితో టచ్‌లో ఉన్నామని విద్యార్థులు చెప్పినట్లు తెలుస్తోంది.

Three engineering students wanted join in ISIS

హైదరాబాద్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఐసిస్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సిట్ విచారణలో విద్యార్థులు చెప్పినట్టు తెలిసింది. అయితే ఆ విద్యార్థులు నగరంలోని ఏఏ కళాశాలలకు చెందినవారు, ఎక్కడి ప్రాంతానికి చెందిన వారు, ఎంత మంది చేరాలనుకుంటున్నారు అన్న విషయం చెప్పడం లేదని అంటున్నారు. నాగపూర్ నుంచి శ్రీనగర్ వెళితే అక్కడి నుంచి అఫ్గానిస్తాన్ మీదుగా సిరియా వెళ్లేందుకు మార్గం సులభమని వారన్నట్లు సమాచార.

శ్రీనగర్ వెళితే అక్కడ పోలీసులు, మిలిటెంట్లు మినహా ఎవరూ ప్రజలను కలుసుకోరని, ప్రతి వారికి అక్కడ ఏదో రకమైన గుర్తింపు కార్డు తప్పనిసరని, అయితే తాము విద్యార్థులం కాబట్టి తమ వద్ద ఐడి కార్డులుంటాయని, దీంతో ఉగ్రవాద సంస్థలకు చెందిన మిలిటెంట్లను కలుసుకొని సిరియా వెళ్లాలనుకున్నామని విద్యార్థులు తమ నేరాంగీకార పత్రంలో చెప్పినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+