Heart Attack: ఆందోళనకు గురి చేస్తున్న గుండెపోట్లు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు యువకుల మృతి..
కరోనా మహమ్మారి తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నాం. ముఖ్యంగా చాలా మంది గుండె పోటుతో మృతి చెందుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురువుతున్నారు. పదేళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు హర్టటాక్ వస్తోంది. ఈ మధ్య యుక్త వయస్సు వారు ఎక్కువగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. గతంలో ఓ కానిస్టేబుల్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా.. కుప్పకూలి చనిపోయాడు.
మరో వ్యక్తి షటిల్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందారు. మరో వ్యక్తి పెళ్లిలో డ్యాన్స్ చేస్తు కుప్పకూలిపోయి మరణించాడు. వీరంతే 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారు. తాజాగా ఖమ్మం జిల్లాలో గుండెపోటు ఇద్దరు యువకులను బలితీసుకుంది. ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ లీడర్ మానుకొండ రాధ కిషోర్ రెండో కొడుకు శ్రీధర్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.

ఉదయం వ్యాయామం చేసిన అతను కొద్దిసేపటికే ఛాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశాడు. మరో ఘటనలో అల్లీపురం గ్రామానికి చెందిన నాగరాజు గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి భోజనం చేస్తుండగానే కిందపడిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ల ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే అతను ప్రాణాలు విడిచాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన నరేశ్ గుండెపోటుతో మరణించాడు. ఇతడి వయస్సు 36 సంవత్సరాలు. భర్త గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన చెల్లెలి కోసం వెతుకుతున్న క్రమంలో నరేశ్ గుండెపోటుకు గురయ్యాడు. ఇలా గుండెపోటుతో చాలా మంది యువకులు ప్రాణాలు విడుస్తున్నారు. గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications