భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
రికార్డు ఉష్ణోగ్రతల వేళ కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అదిలాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగింది. భారీ వర్షంతో నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇదే సమయంలో వాతావరణ శాఖ రానున్న మూడు రోజులకు సంబందించి కీలక సమాచారం అందించింది.
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది. నిజామాబాద్ లో పలు మండలాల్లో పంట నష్టం జరిగింది. నగరంలోని కొత్తపేట, సరూర్‌నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, కాచిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, జల్‌పల్లిలో వర్షం కురుస్తున్నది.

ఆకాశం మేఘావృతమై ఉన్నది. శనివారం ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో వడగాల్పులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మరో రెండు రోజులు
వడగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది.
రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, తాజా అంచనాల మేరకు ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వాతావరణ శాఖ హెచ్చరిక
మరో వైపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు- గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. శనివారం ఆదిలాబాద్, కొమరంబీం ఆసీఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో వడగాల్పులతోపాటు అక్కడడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రోజుల్లో గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications