నడి రోడ్డుపై బడ్జెట్ ప్రతులు దహనం (ఫోటోలు)
హైదరాబాద్: గత ప్రభుత్వాల మాదిరే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ విద్యారంగానికి కేవలం రూ. 10,596 కోట్లు కేటాయించి విద్యార్ధులకు ద్రోహం చేసిందని తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య జాతీయ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఆరోపించారు.
తెలంగాణ తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య (టీటీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు విద్యారంగానికి 16 శాతం నిధులు కేటాయిస్తే, బంగారు తెలంగాణ అంటూ చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10.9 శాతం నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయానికి కేవలం రూ. 8 కోట్లు కేటాయించారని ఆవేదన వెలిబుచ్చారు. ఉద్యోగాల భర్తీ అంశం బడ్జెట్‌లో ప్రస్తావించకుండా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారన్నారు. ఈ కార్యక్రమంలో టీటీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
గత ప్రభుత్వాల మాదిరే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ విద్యారంగానికి కేవలం రూ. 10,596 కోట్లు కేటాయించి విద్యార్ధులకు ద్రోహం చేసిందని తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య జాతీయ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఆరోపించారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
తెలంగాణ తెలుగునాడు విద్యార్ధి సమాఖ్య (టీటీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, బడ్జెట్ ప్రతులను దహనం చేశారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు విద్యారంగానికి 16 శాతం నిధులు కేటాయిస్తే, బంగారు తెలంగాణ అంటూ చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10.9 శాతం నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
పాలమూరు విశ్వవిద్యాలయానికి కేవలం రూ. 8 కోట్లు కేటాయించారని ఆవేదన వెలిబుచ్చారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
ఉద్యోగాల భర్తీ అంశం బడ్జెట్‌లో ప్రస్తావించకుండా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించారన్నారు.

తెలంగాణ బడ్జెట్ ప్రతులను దహనం చేసిన టీఎన్ఎస్ఎఫ్
ఈ కార్యక్రమంలో టీటీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications