బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి: సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానం, ప్రత్యేక కానుక
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం-లక్ష్మి దంపతులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పెద్ద కొడుకు గౌతమ్‌తో కలిసి ప్రగతి భవన్‌లో చిన్న కొడుకు సిద్ధార్థ్ పెళ్లికి రావాలని సీఎం కేసీఆర్ దంపతులకు ఆహ్వానపత్రికను అందజేశారు.
హైదరాబాద్‌లో జరిగే పెళ్లి వేడుకకు తప్పకుండా హాజరుకావాలని సీఎం దంపతులను కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం-లక్ష్మి దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, తన నివాసానికి వచ్చిన బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. బ్రహ్మానందంను ఆప్యాయంగా హత్తుకున్నారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన తిరుమల శ్రీవారి పెన్సిల్ డ్రాయింగ్‌ను బ్రహ్మానందం సీఎం కేసీఆర్ కు బహూకరించారు.

బ్రహ్మానందం పెద్దకుమారుడు రాజా గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పలు చిత్రాల్లో హీరోగా నటించిన గౌతమ్.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. రెండో తనయుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు. మొదటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ.. విదేశాల్లో విద్యనభ్యసించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. ఇక సిద్ధార్థ్ ఈ ఏడాది మేలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ లో జరుగనున్న తన కుమారుని వివాహానికి ఆహ్వానిస్తూ ఈరోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కుటుంబ సమేతంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ బ్రహ్మానందం.
— Telangana CMO (@TelanganaCMO) July 29, 2023
ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మానందం దంపతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/6tk7STEbYL
ఈ క్రమంలోనే బ్రహ్మానందంకు రెండో తనయుడు సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోబుతున్నారు. ఆమె కూడా డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. మే 21న హైదరాబాద్‌లో సిద్ధార్థ్ - ఐశ్వర్య నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications