Revanth Reddy Biopic: త్వరలో రేవంత్ రెడ్డి బయోపిక్ ! బండ్ల గణేష్ మరో సంచలనం...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం తర్వాత రేవంత్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. ఇన్నాళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ను ఢీకొట్టే నేతగా మాత్రమే చర్చల్లో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు .. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుతో వీరుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి వీరాభిమాని అయిన టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆయనపై అభిమానాన్ని అస్సలు దాచుకోవడం లేదు.

ఇప్పటికే రేపు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఇందుకు వేదికై ఎల్బీ స్టేడియానికి రాత్రికే వెళ్లి పడుకుంటున్న బండ్ల గణేష్ .. రేపు ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ అక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు అదే ఊపులో ఆయన మరో ప్రకటన కూడా చేశారు. ఓ టీవీ ఛానల్ లైవ్ షోలో పాల్గొన్న బండ్ల గణేష్ మరో కీలక ప్రకటన కూడా చేసేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి జీవితంపై ఓ బయోపిక్ చేస్తానని బండ్ల ప్రకటించారు.

tollywood producer bandla ganesh announced to film revanth reddys biopic soon

రేవంత్ రెడ్డి అంగీకరిస్తే ఆయన కథతో సినిమా తీస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. రేవంత్‌రెడ్డికి ఎంతో మంది విలన్‌లు ఉన్నారని, ఆయన్ను జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని బండ్ల గుర్తుచేసుకున్నారు. అలాగే ఇబ్బందులు పడిన చోటే నాయకుడిగా ఆయన అధికారం చేపడుతున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ కు ఆకలి, కసి, కష్టం, పాలన తెలుసన్నారు. మరోవైపు ఎక్స్ లో కేటీఆర్ గన్ పట్టుకుని ఉన్న ఫోటో చూసి భయపడ్డానని బండ్ల వెల్లడించారు.

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గర అలర్ట్ గా ఉండమని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పినట్లు బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని బండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్ అద్భుత పాలన చేస్తుందని, కాబట్టి గ్రేటర్ వాసులు కూడా ఆదరించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+