Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ కు దగ్గరలో ఈ టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసా..?

హైదరాబాద్ మహానగరానికి 400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగి ఉంది. హైదరాబాద్ లో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఉన్నాయి. కాకతీయుల కాలం నుంచి ఈ నగరం పలు దశల్లో అభివృద్ధి చెందుతూ వస్తోంది. చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, కుతుత్ షాహీ సమాధులు, ఫలక్ నుమా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం.. తదితర చారిత్రక కట్టడాలు నగరానికి తలమానికంగా నిలుస్తున్నాయి. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ ఎన్నో పర్యటక ప్రదేశాలు ఉన్నాయి. సిటీ నుంచి కేవలం 3 నుంచి 4 గంటల్లోనే ఈ ప్రాంతాలను చుట్టేసి రావచ్చు. వీకెండ్ లో అయితే ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు.

హైదరాబాద్ కు అనంతగిరి హిల్స్ కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అనంతగిరి కొండల్లోకి వెళ్తే ప్రకృతి ఒడిలో అడుగులు వేసిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్‌ ఆహ్లాదంగా సాగిపోతుంది. కపుల్స్, ఫ్యామిలీ, బైకర్స్ అలాగే వీకెండ్ ట్రావెల్ ఇష్టపడేవారికి మంచి స్పాట్ గా చెప్పొచ్చు. వికారాబాద్‌ కు 10 కిలోమీటర్లు, నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ కొండలు ఉన్నాయి. గుహలు, కోటలు, ఆలయాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.

వైజాగ్ కాలనీ.. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చుట్టూ కొండలు, ఆపైన సాగర్ బ్యాక్ వాటర్ అందాలు.. వీటిని చూడాలంటే రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉంటుంది. దీనికితోడూ నీళ్ల మధ్యలో ఐల్యాండ్ కూడా ఉంటుంది. ఇక బోట్ రైడింగ్ తో పాటు సాహస యాత్రను ఇష్టపడేవారికి వైజాగ్ కాలనీ మంచి ఛాయిస్ గా చెప్పొచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల్లోనే వెళ్లి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.

భువనగిరి కోట 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నగరానికి అతి సమీపంలో ఉండడంతో పర్యాటకులు ఈ ప్రాంతానికి భారీగా వస్తున్నారు. ముఖ్యంగా సాహస ప్రియులకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ కోటపై భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్ పేరుతో ఓ ప్రైవేటు శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కోటపైన ఉన్న ప్రధాన ద్వారాలు, కోట నిర్మాణ శైలి పర్యటకులను కట్టి పడేస్తుంది. కోట ప్రహారీ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.

పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ.. ఈ పర్యాటక ప్రాంతం మెదక్‌‌‌‌, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. నిజాం కాలంలో షికార్‌‌‌‌ ఘర్‌ ‌గా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. ఇప్పుడు ఫేమస్‌‌ పిక్నిక్​ స్పాట్‌ గా మారింది‌. ఈ శాంక్చురీలో రెండు డీర్‌‌‌‌ బ్రీడ్‌‌‌‌ సెంటర్ లు ఉన్నాయి. అలాగే వందల కృష్ణ జింకలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచారం ఆనకట్ట & వన్యప్రాణుల అభయారణ్యం వెళ్ళవచ్చు. అలాగే సరస్సు, బోటింగ్, పక్షుల వీక్షణ, పిక్నిక్ స్పాట్‌ లు ఇక్కడ ఉన్నాయి.

Top 5 Weekend Getaways Near Hyderabad Ananthagiri Hills Vizag Colony Backwaters Bhongir Fort Pocharam Sanctuary amp amp Mallela Theertham

మల్లెల తీర్థం జలపాతం.. నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట సమీపంలో ఈ జలపాతం ఉంది. సుమారు 150 అడుగుల ఎత్తు నుండి వాటర్ కిందకు పడుతుంది. మహాశివుడు కోలువైన ఈ ప్రాంతం ఆధ్యాత్మికతకు చిహ్నంగా నిలుస్తోంది. హైదరాబాద్ కు 185 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు ప్రశాంతమైన నిలయంగా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+