బీజేపీకి కష్టకాలం; కేసీఆర్ కి కలిసొచ్చే కాలం!!

కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు బాగా కలిసి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోవాలని ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలని, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని శతవిధాల చేసిన ప్రయత్నాలన్నీ ప్రస్తుతం బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టుగా కనిపిస్తున్నాయి. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకతాటి మీద తెలంగాణ సీఎం కేసీఆర్ పై, బిఆర్ఎస్ పై సమరం చేయాల్సిన బిజెపి నేతలు దానిని పక్కన పెట్టి ఆధిపత్యపోరులో అంతర్భాగమయ్యారు. దీంతో బిజెపి అనుకున్న లక్ష్యానికి దగ్గరగా కాకుండా దూరంగా జరుగుతోంది.

Tough time for BJP; Its happiest time for CM KCR!!

సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లకు బిజెపిలో అదనపు బాధ్యతలు అప్పగించాలని బండి సంజయ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత నుండి తప్పించాలని పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు కోరుకోవడం బిజెపి అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. వ్యూహాత్మకంగా ఎన్నికలకు పని చేయాల్సిన చోట బీజేపీ నేతలు అది పక్కన పెట్టి పదవులకోసం కొట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది.

భవిష్యత్తులో బీజేపీ విజయం సాధిస్తే సీఎం తామేనని చెప్పుకునే ప్రయత్నం చేయడం వంటి అంశాలతో బీజేపీలోని క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతింది. అధిష్టానం కీలక నాయకులను పిలిచి చర్చలు జరిపి, హెచ్చరికలు చేస్తున్నా రాష్ట్ర బీజేపీ నాయకుల్లో మార్పు లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి 33 మంది నాయకులు చేరడంతో బీజేపీకి అది గట్టి షాక్ ఇచ్చినట్టు అయింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నాయకులు కూడా పార్టీలోకి తీసుకు రాలేకపోయిన తెలంగాణ బీజేపీ నాయకుల అసమర్థతపై బిజెపి అధినాయకత్వం గుర్రుగా ఉంది. ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని భయపడిన సీఎం కేసీఆర్, ప్రస్తుతం బీజేపీ విషయంలో బిందాస్ గా ఉన్నారు. అంతర్గత గొడవలతో బిజెపి నాయకులు వచ్చే ఎన్నికల పై ఫోకస్ చేయలేరని ధీమాతో ఉన్నారు.

అందుకే ఇటీవల కాలంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప బిజెపి వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బిజెపిని బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు. అందుకు కారణం బిజెపి ప్రస్తుత పరిస్థితి. ఇక ఈ పరిణామాలు మారకపోతే, అధిష్టానం తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే తెలంగాణ బిజెపి వచ్చే ఎన్నికలకు బలంగా వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. అధిష్టానం అనుకున్నట్టు జెండా ఎగిరే ప్రసక్తే లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+