సురేఖ కొత్త పదవికి బ్రేక్ - తెర వెనుక, ఢిల్లీ కేంద్రంగా..!?

కొండా సురేఖ వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ తరువాత కొండా సురేఖ కు ఢిల్లీ రావాలని కబురు అందింది. ఈ విషయాన్ని స్వయంగా కొండా మురళీ వెల్లడించారు. మంత్రివర్గం నుంచి తప్పించటంతో మరో నామినేటెడ్ పదవి ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. ఢిల్లీ వెళ్లేందుకు సురేఖ సిద్దం అవుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది.

కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొండా దంపతులు తమ మద్దతు దారులతో సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను ప్రస్తావించారు. ఇదే సమయంలో మురళీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కొండా సురేఖను ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుండి చాలా సార్లు పిలిచారు.. కానీ పోవడం లేదు పరకాలలో సుస్మిత చూసుకుంటది.. ఇక్కడ నేను, సురేఖ చూసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు కారణమయ్యాయి.

TPCC Chief Mahesh Goud reacts over AICC call for Konda Surekha and speculations on nominated post

తమకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారని... కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం.. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తామంటూ స్పష్టం చేశారు. దీంతో.. కొండా సురేఖ ఢిల్లీ వెళ్తున్నారని.. కేబినెట్ హోదా తో నామినెటెడ్ పదవి దక్కనుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, ఇంతలోనే ఢిల్లీ కేంద్రంగా సీన్ మారినట్లు తెలుస్తోంది.

బ్రహ్మోత్సవాల వేళ దర్శనాల పై TTD కీలక నిర్ణయం- భక్తులకు ప్రత్యేక సూచనలు..!!
బ్రహ్మోత్సవాల వేళ దర్శనాల పై TTD కీలక నిర్ణయం- భక్తులకు ప్రత్యేక సూచనలు..!!

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు

కొందరు ముఖ్య నేతలు.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి.. వెంటనే ఢిల్లికి పిలిపించి మాట్లాడ టం.. పదవి ఇవ్వటం ద్వారా ప్రతికూల సంకేతాలు వెళ్తాయని వివరించినట్లు చెబుతున్నారు. దీంతో.. కొండా సురేఖ ఢిల్లీ వచ్చి కలిసినా.. పదవి విషయంలో మాత్రం నిర్ణయం ఉండదని పార్టీ ముఖ్య నేతల సమాచారం. సురేఖ కు పదవి ఇస్తే పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టు తగ్గుందని ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల వాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు తమకు సమాచారం లేదు అన్నారు. దీంతో.. టీపీసీసీకి సమాచారం లేకుండా సురేఖ విషయంలో ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోదని పార్టీ నేతల వాదన. ఈ పరిణామాలతో సురేఖ పార్టీలోనే కొనసాగినా.. ఎలాంటి పదవి ఇప్పట్లో దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేసిన కొండా దంపతుల రాజకీయం ఎలా ఉంటుందనే ఆసక్తి పార్టీలో నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+