Revanth Reddy: వన దేవతలకు మొక్కి.. హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క,సారక్క గద్దెలను దర్శించుకున్నారు.హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు మేడారం చేరుకున్న ఆయనకు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో ను యాత్రను రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ నెల 22 వరకు


ఈ యాత్రలో ఆయనతో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు తొలి విడుత పాదయాత్ర జరగనుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరు నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని ఏఐసీసీ నిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని ఎమ్మెల్యే సీతక్క ఆదివారం తెలిపారు.

మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం


రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 10 రోజులపాటు సాగనుంది.మేడారంలో ప్రారంభమైన ఈ యాత్ర తాడ్వాయి మండలంలోని కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్ గ్రామాల మీదుగా గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టు నగర్ వరకు చేరుకుంటుంది. సాయంత్రం 6:00 గంటలకు పస్రా జంక్షన్లో కార్నర్ మీటింగ్ ఉంటుంది.

వెంకటాపూర్ క్రాస్ రోడ్డు


సాయంత్రం 6 గంటలకు వస్త్రా గ్రామం నుంచి నుంచి గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్ మీదుగా జవహర్ నగర్, జంగాలపల్లి క్రాస్, ఇంచర్ల, వెంకటాపూర్ క్రాస్ రోడ్డు మీదుగా పాలంపేటకు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక మంగళవారం నాడు ఉదయం 8:30కు పాలింపేట నుంచి బయలుదేరి రామాంజపూర్, చెంచు కాలనీ, నారాయణగిరి పల్లె మీదుగా బుద్ధారం గ్రామానికి చేరుకుంటారని, అక్కడ భోజన విరామం ఉంటుంది.

గాంధీ పార్క్

మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి బుద్ధారం గ్రామం నుంచి కేశవాపూర్, నర్సాపూర్, బండారుపల్లి మీదుగా సాయంత్రం 6 గంటల వరకు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ములుగు జిల్లా కేంద్రంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+