హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ నెల 10 నుంచి 16 మధ్య ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. పండుగలు, ఉత్సవాలప్పుడు ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. వినాయక చవితి వంటి పండుగలు వస్తే మాత్రం అధిక రద్డీతో ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేది నుంచి అంటే నేటి నుంచి 16వ తేది మధ్య జరిగే గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా, నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (HTP) నగరంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు.

పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఈ ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించబోమని అధికారులు తెలిపారు. సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ క్రాస్ రోడ్ల వైపు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఇక, పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి వెళ్లే వారు ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా కాకుండా షాదన్ కాలేజీ, లక్డీ-కా-పుల్ వైపు మళ్లించనున్నారు. ఈ మార్గాలతో పాటు అంబేద్కర్ విగ్రహం నుంచి వెళ్లే వాహనాదారులను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించబోమని, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్బాల్ మినార్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు కట్ట మైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు మళ్లించనున్నారు. అలాగే, కట్ట మైసమ్మ దేవాలయం నుండి ట్రాఫిక్‌ను చిల్డ్రన్స్ పార్క్ వైపు అనుమతించరు. డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి వెళ్లే వాహనాలు సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఆ వాహనాలన్నింటిని డీబీఆర్ మిల్స్ వైపు మళ్లించనున్నారు. ఇక, మినిస్టర్స్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు, నల్లగుట్ట బ్రిడ్జి వద్ద కర్బలా వైపు మళ్లించనున్నారు. బుద్ధ భవన్ నుంచి వచ్చే వాహనాలను పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు అనుమతించకుండా, నల్లగుట్ట బ్రిడ్జి వద్ద మినిస్టర్ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications