వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నారాయణపేట జిల్లాలో విషాదం .. మట్టిదిబ్బ కూలి పది మంది మృతి

|
Google Oneindia TeluguNews

నారాయణ పేట జిల్లా మరికల్‌ మండలం తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలు 10 మంది మృతిచెందిన ఘటన జిల్లా వాసులను ఆవేదనకు గురి చేస్తుంది .

అసలు ఘటన ఎలా జరిగిందంటే నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం తీలేరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు మట్టి దిబ్బ తవ్వే క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలి మృత్యువాత పడ్డారు. మట్టి దిబ్బ కూలి 10 మంది మృతిచెందారు.మట్టిపెళ్లల కింద 10 మంది దాకా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం తీలేరు గ్రామానికి చెందినా 30 మంది ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది .

tragedy occurred in Narayanapeta district ..10 people were died in the mud collapsed

ఇక ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మట్టిపెళ్లలను తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీల మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

English summary
The tragedy occurred in Narayanapeta district Marikal Mandalam teeleru village.Workers who are working as Employment Guarantee Workers suddenly met with an accident of ditching the mud.At least 10 people were died in the mud collapsed incident .There are about 15 people under clays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X