తెలంగాణ టెక్కీని కాల్చిచంపిన అమెరికా పోలీసులు

అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ యువకుడిని పోలీసులు కాల్చి చంపారు. ఆయనపై నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరపడానికి గల కారణాలను కాలిఫోర్నియా పోలీసులు వివరించారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మృతుడి పేరు మహమ్మద్ నిజాముద్దీన్‌. ఆయన స్వస్థలం మహబూబ్ నగర్. ఆయన తండ్రి హస్నుద్దీన్.. రిటైర్డ్ టీచర్. 2016లో నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళాడు. మొదట ఫ్లోరిడాలో చదువుకున్నాడు. ఆ తర్వాత శాంటా క్లారాకు మారాడు. అక్కడ మరికొందరితో కలిసి నివాసం ఉంటోన్నాడు. తన రూమ్మేట్‌పై కత్తితో దాడి చేశాడన్న ఆరోపణలపై కాలిఫోర్నియా పోలీసులు నిజాముద్దీన్ పై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

Tragic Incident Telangana Techie Killed by Police in the US Following Roommate Altercation

సెప్టెంబర్ 3వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకోగా.. రెండు వారాల తర్వాత అంటే గురువారం ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసింది. కర్ణాటకలోని రాయచూరుకు చెందిన తన కుమారుడి స్నేహితుడి ద్వారా ఈ విషయం తెలిసిందని హస్నుద్దీన్ తెలిపారు. ప్రస్తుతం ఆ స్నేహితుడు కూడా శాంటా క్లారాలోనే ఉన్నాడని చెప్పారు. సంఘటన జరిగిన విషయం తనకు ఇప్పటివరకు తెలియదని, కుమారుడితో మాట్లాడటానికి చాలాసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చిందని అన్నారు.

తోటి రూమ్మేట్ తో నిజాముద్దీన్ గొడవ పడ్డాడని, ఈ సమాచారం అందుకున్న తర్వాత సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతన్ని వారించడానికి ప్రయత్నించారని, ఈ ప్రక్రియలో పోలీసులు కాల్పులు జరిపినట్లు మజ్లిస్ బచావో తెహ్రీక్ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ చెప్పారు. నిజాముద్దీన్‌పై పోలీసులు నాలుగు రౌండ్ల పాటు కాల్చినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి సహాయం చేయాలని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.

ఈ ఘటనపై శాంటా క్లారా పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ కోరీ మోర్గాన్ మాట్లాడారు. ఓ ఇంట్లో గొడవ జరుగుతున్నట్లు సెప్టెంబర్ 3న తెల్లవారు జామున 6.08 నిమిషాలకు 911 ఫోన్ కాల్ వచ్చిందని, ఆ వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని చెప్పారు. ఇద్దరు రూమ్మేట్ల మధ్య జరిగిన గొడవ హింసకు దారితీసిందని, తాము అక్కడికి చేరుకోకముందే ఇద్దరిలో ఒకరు మరొకరిని కత్తితో పొడిచాడని వివరించారు.

తాము ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు.. నిజాముద్దీన్ కత్తి పట్టుకుని మళ్లీ దాడి చేస్తానని బెదిరించాడని అన్నారు. దీంతో ఈ దాడిని నివారించడానికి కాల్పులు జరపాల్సి వచ్చిందని కోరీ మోర్గాన్ తెలిపారు. సంఘటనా స్థలం నుండి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+