పట్టాల పైకి వరద నీరు, నిలిచిపోయిన పలు రైళ్లు - రైల్వే కీలక సూచనలు..!!

రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. మొంథా తుఫాను కారణంగా రైల్వే శాఖ ఇప్పటికే పెద్ద సంఖ్య లో రైళ్లను రద్దు చేసింది. తెలంగాణ లోనూ కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ స్టేషన్ వద్ద ట్రాక్ మీద వరద నీరు చేరింది. ఫలితంగా పలు ప్రధాన రైళ్లు నిలిచిపోయాయి. అదే విధంగా ఇతర స్టేషన్లలోనూ రైళ్లు నిలిపి వేసారు. ప్రయాణీకులు రైళ్లు నిలిచిపోవటంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా, రైళ్ల రద్దు.. నిలిపివేత పైన ప్రయాణీకులకు అధికారులు కీలక సూచనలు అందిస్తున్నారు.

తుఫాను తీరం దాటిన తరువాత హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా లో రైలు పట్టాల పైకి వరద నీరు చేరడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడే డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో పట్టాల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. డోర్నకల్‌ రైల్వేస్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతి మడుగులో కోణార్క్​ ఎక్స్​ప్రెస్​ను నిలిపివేశారు. కొండపల్లిలో సాయినగర్​ షిర్డీ ఎక్స్ ప్రెస్ ​ను ఆపేశారు. పందిళ్లపల్లి స్టేషన్ లో విజయవాడ - భద్రాచలం రైలు నిలిచిపోయింది.

train-services-have-been-disrupted-as-flood-water-over-flowed-the-tracks

అలాగే రాష్ట్రంలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్​ రైళ్లు తుపాను ఎఫెక్ట్​ దాటికి నిలిచిపోయాయి. కాజీపేట-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాగా, ఇప్పటికే తుఫాను.. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఇందులో 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఈ జాబితాలో పలు ప్రధాన రైళ్లు ఉన్నాయి. ఫలక్ నుమా, ఈస్ట్​ కోస్ట్​, గోదావరి, విశాఖ, నర్సాపూర్​ ఎక్స్​ప్రెస్​లు రద్దు అయ్యాయి.

వర్షాల కారణంగా పలుచోట్ల రైల్వేస్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. ఇవాళ విశాఖపట్టణం నుంచి లింగంపల్లికి వచ్చే జన్మభూమి ఎక్స్​ప్రెస్​ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. వరద నీరు కారణంగానే రైళ్లు నిలిచాయని.. ఎక్కడా ట్రాక్ దెబ్బ తినలేదని అధికారులు స్పష్టత ఇచ్చారు. భారీ వర్షాల వేళ పరిస్థితులకు అనుగుణంగా రద్దు చేసిన రైళ్ల పునరుద్దరణ పైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+