వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ 103.. కాంగ్రెస్ 6... కేసీఆర్ కళ నెరవేరిందా...!

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం కావడంతో టీఆర్ఎస్ అసెంబ్లీ సభ్యుల మార్క్ 103కు చేరింది. దీంతో అసెంబ్లీలో మెజారీటి ఉన్న ప్రతిపక్ష నాయకులు లేకుండా పోయారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ 100 సీట్లు సాదిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే..

కాగా టీఆర్ఎస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను గెలుచుకుంది. ఇక ఎంఐఎం ఏడు స్దానాల్లో , టీడీపీ 2 స్థానాలు, బీజేపీ ఒక్క స్థానంలో విజయం సాధించగా ఇద్దరు ఇండిపెండెంట్‌లు ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇండిపెండెంట్‌గా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో పాటు మరో ఇండిపెండేంట్ ఎమ్మెల్యే లావుడ్య రాములు, టీడీపీ నుండి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

TRS @ 103 .. Congress @ 6 in telangana assembly

ఇక కాంగ్రెస్ నుండి ఒక్కోక్కరుగా రేగా కాంతారావు నుండి నేడు చేరిన రోహిత్ రెడ్డి వరకు మొత్తం పన్నేండు మంది టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 103కు చేరింది. దీంతో అధికార టీఆర్ఎస్ బలం 103కు చేరగా ఎమ్ఐఎమ్‌కు 7గురు ఎమ్మెల్యేలు ఉండగా , కాంగ్రెస్ పార్టీకి ప్రస్థుతం 6గురు సభ్యులు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావులు ప్రస్థుతం అసెంబ్లీలో ఉన్నాడు. కాగా హుజుర్‌నగర్ స్థానం నుండి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామ చేయడంతో ఆ స్థానం ఖాలీగా ఉంది.

English summary
TRS party has crossed the 100-seat mark in the Assembly.The majority of congress MLAs were merged into the TRS There is a mezarity in the assembly Opposition leaders were gone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X