యాదాద్రి గుడి బోర్డులో సినీ హీరో సతీమణి, ఆంధ్రా వాళ్లను తొలగించాలి- కవిత..!!

కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్రా రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్ గా పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ భక్తుల పెసలతో కట్టిన యాదాద్రి గుడి లో మెంబర్ గా ఆంధ్రా హీరో భార్యకు అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రావాళ్లను తొలగించాలని డిమాండ్ చేసారు. హరీష్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు.

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆంధ్రా వాళ్ల ఏజెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణలో పాలన నడుస్తోందని విమర్శించారు. అందుకే ఈ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగితే మాట్లాడటం లేదన్నారు. ఈ సీఎం కు ఇప్పటికైనా తెలంగాణ సోయి రావాలని... లేదంటే ఆయన ఎప్పుడు కనిపించిన సరే ఆంధ్రా రేవంత్ రెడ్డి అనే పిలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ ముఖ్యమంత్రి కి బీజేపీ, ఆంధ్రావాళ్లతో లాలూచీ ఉందని... అందుకే తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు.

TRS Chief Kavitha asked how a person from Andhra Pradesh can be on a Telangana Yadadri temple board

కృష్ణా నీళ్లను ఆంధ్రావాళ్లు పట్టుకోని పోయిన సరే ఆయన పట్టించుకోవటం లేదని విమర్శించారు. యాదాద్రి గుడి లో మెంబర్ గా ఆంధ్రా హీరో భార్యకు అవకాశం ఎలా కల్పించారని ప్రశ్నించారు. తిరుమల ఆలయంలో తెలంగాణ భక్తుల పైసలు ఉన్నాయని..అందుకే తెలంగాణ వారికి అక్కడ అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. యాదాద్రి గుడి బోర్డులో కూడా ఆంధ్రావాళ్లను తొలగించాలి అని కవిత డిమాండ్ చేసారు.

 మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!
మోదీ కేబినెట్ ప్రక్షాళన, ఇన్- ఔట్ ఇలా: తెలుగు రాష్ట్రాల నుంచి.. లిస్టులో...!!

కవిత వ్యాఖ్యలపై చర్చ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు హరీశ్ రావు వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధం చేసుకొంటు న్నారని, పార్టీని పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని కవిత ధ్వజమెత్తారు. ఇటీవల హరీశ్ రావు మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని కవిత వెల్లడించారు. ఆ భేటీలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే ద్వారా తనకు విశ్వసనీయ సమాచారం అందిందని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్నాక, బీజేపీ మద్దతు తీసుకోవాలనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని ఆరోపించారు.

ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు నగరానికి వచ్చిన ప్రతిసారీ 'రాజ్‌పుష్ప ఓపెన్ స్కై విల్లాస్' కేంద్రంగా హరీశ్ రావు తన షెడ్యూల్స్ రద్దు చేసుకుని రహస్య మంతనాలు సాగిస్తున్నారని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు పెద్ద ఎత్తున క్విడ్ ప్రో కో వ్యవహారాలకు పాల్పడ్డారని కవిత తీవ్ర ఆరోపణలు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+