వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సార్వత్రిక ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళాలని కెసిఆర్ యోచన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్.సర్వే ఫలితాల అధికార టిఆర్ఎస్ పార్టీకి మంచి ఊపునిస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధుల పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ......ఓవరాల్ గా పార్టీ పై ,ముఖ్యమంత్రిపై ప్రజలకు విశ్వాసం మెండుగా ఉంది.ఈ కారణంగానే ఏడాది ముండుగానే ఎన్నికలకు వెళ్ళాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నారు..ఏడాది ముందుగానే ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ కూడ చెబుతుంది. నిర్ణీత వ్యవధి కంటే ముందుగానే ఎన్నికలు వచ్చేలా కన్పిస్తున్నాయి.

2014 జనరల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించింది..జనరల్ ఎన్నికల తర్వాత జరిగిన ఒక్క ఎంఏల్ సి స్థానంలో మినమా అన్ని ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.ప్రభుత్వ పనితీరుపై ఇటీవల ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో విపక్షాల అడ్రస్ గల్లంతైంది. ఈ సర్వే ఫలితాల పట్ల టిఆర్ఎస్ కు ప్రజల పట్ల ఉన్న ఆదరణను అర్థం చేసుకోవచ్చంటున్నారు అధికార టిఆర్ఎస్ నాయకులు.

kcr

ఇంటలిజెన్స్ తో పాటు నాలుగు సర్వే ఏజన్సీల ద్వారా కెసిఆర్ నిర్వహించిన సర్వేలో అధికార పార్టీకే ప్రజలు మద్దతును తెలిపారు.కొందరు ప్రజా ప్రతినిధుల పనితీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ....ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతఈ?ప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ సర్వే పలితాల ఆధారంగా విపక్షాల మానసికస్థైర్యాన్ని మరింత దెబ్బతీసేలా అధికార పార్టీ వ్యూహారచన చేస్తోంది.

ప్రజల నాడి తమకు అనుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్తే పలితాలను రాబట్టుకోవచ్చని టిఆర్ఎస్ చీప్ భావిస్తున్నారు.2014 లో జనరల్ ఎన్నికలు జరిగాయి. 2019 లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే జనరల్ ఎన్నికల వల్ల కొంత నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాన్ని కెసిఆర్ వ్యక్తం చేస్తున్నారు.కేంద్రంలో, రాష్ట్రంలో మరోపార్టీని గెలిపించుకోవద్దు....రెండు చోట్ల ఒకే పార్టీ అధికారంలో రావాలనే అభిప్రాయం ప్రజల్లో వస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కెసిఆర్ భావిస్తున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్న కాలంలో నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళారు. అదే తరహాలో నిర్ణీత కాల వ్యవధి కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలని గులాబీ బాస్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ ఏడాది ముందుగానే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు.

English summary
trs chief kcr plan want to go one year before for assembly elections. There is a problem regional parties.people happy trs governament tell a survey. so trs chief want fo before one year elections for assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X