
తెలంగాణ భవన్‌లో తుపాకీ కలకలం -ఎమ్మెల్సీ గెలుపు సంబరాల్లో టీఆర్ఎస్ నేత అతి -అగ్నిప్రమాదం
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ సాధారణ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి క్లీన్ విక్టరీ లభించింది. తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో గులాబీ సైనికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, ఒకరిద్దరు నేతల సంబురాలు మాత్రం శ్రుతిమించాయి. కార్యకర్తల అతి కారణంగా ఆఫీసులోని కొంత భాగం తగలబడింది..
తెలంగాణ భవన్‌లో తుపాకీతో ఓ నేత హల్ చల్ చేశాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ గన్‌తో హల్‌చల్ చేశారు.
షాకింగ్:
తీన్మార్
మల్లన్న
ఓటమిని
తట్టుకోలేక
యువకుడు
ఆత్మహత్య
-పార్టీలే
సూసైడ్
చేసుకోవాలంటూ

టీఆర్ఎస్ భవన్ దగ్గర జరిగిన సంబరాల్లో భాగంగా.. గాల్లోకి కాల్పులు జరిపేందుకు కట్టెల శ్రీనివాస్ యత్నించారు. అయితే పక్కనున్నవారు ఆపడంతో.. వెంటనే తేరుకున్న శ్రీనివాస్ దాన్ని జేబులో పెట్టుకున్నారు. దాదాపు అదే సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి.

ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం తర్వాత పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కాల్చిన బాంబుల తాలూకు నిప్పురవ్వలు ఆఫీసు మొదటి అంతస్తులో పడటం, అక్కడున్న వస్తువులు అంటుకుని భారీగా మంటలు చెలరేగడంతో కార్యకర్తలు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో ఫైరింజన్లు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు స్వల్ప గాయాలయ్యాయి.