కేసీఆర్‌ను తిట్టడమేనా ఈటల సంస్కారం : ఒరేయ: అంటూ విపరీత వ్యాఖ్యలు చేసావ్ : కౌశిక్ రెడ్డి..!!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పైన టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి తీవ్రంగా మండి పడ్డారు. రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలను సంధించారు. హుజూరాబాద్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని ప్రశ్నించారు. రాజేందర్ కు కేసీఆర రాజకీయ భిక్ష పెట్టారనే విషయం అంరికీ తెలుసన్నారు. 2004 ముందు ఈటల ఎవరో తెలియదు..కానీ కేసీఆర్.. ఈటలను ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా , మంత్రిగా చేశారు.
అలాంటి కేసీఆర్ పైన, హరీశ్ రావు పైన అరేయ్, ఒరేయ్ అంటూ.. విపరీత వ్యాఖ్యలు చేస్తున్నావు ఇదేనా ఈటల.. నీ సంస్కారం... అంటూ ఆయన ప్రశ్నించారు. ఈటలను ముఖ్యమంత్రి కావాలి అని రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎంపీ అరవింద్ అన్నపుడు ఈటల ఎందుకు ఖండించలేదు? అంటే ఈటలకు ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక మదిలో ఉందనే కదా అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ డబ్బులు పంచుతోందని ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఒక్క ఎకరం అమ్మితే ఒక్క ఎలక్షన్ కొట్లాడతా.. అలాంటిది 200 ఎకరాలు ఉందని అని రాజేందర్ స్వయంగా అన్నారని గుర్తు చేసారు.

మా ఆస్తులన్నీ అమ్మైనా సరే ఓటర్లకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తాం అని ఈటల సతీమణి జమునా రెడ్డి అన్న విషయం వాస్తవం కాదా అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. నేను దొడ్డుబియ్యం తిన్నా.. నాకు డబ్బులు లేనప్పుడు ఆర్ కృష్ణయ్య నన్ను హాస్టల్ లో చదివించారు అని చెప్పిన ఈటల వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇప్పటికే కౌశిక్ ను తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా చేస్తూ గవర్నర్ కు సిఫార్సు చేసింది.
అయితే, కౌశిక్ పైన ఉన్న కేసుల కారణంగానే గవర్నర్ ఆ ఫైల్ ను ఇంకా ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా గవర్నర్ సైతం తన వద్దే ఫైల్ ఉందని..నిర్ణయం తీసుకోవటానికి కొంత సమయం అవసరమని చెప్పారు. ఇక, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఈటల చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఈటల ఓటమి కోసం టీఆర్ఎస్ తరపున కౌశిక్ ప్రచారం నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications