మైనర్ బాలికపై టీఆర్ఎస్ నాయకుడి అత్యాచారం; మండిపడుతున్న ప్రతిపక్షాలు, టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్

నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయిన సాజిద్ ఖాన్ 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. దిద్దుబాటు చర్యలలో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సాజిద్ ఖాన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.

మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్

మైనర్ బాలికపై పలు మార్లు అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్

అసలు విషయానికి వస్తే నిర్మల్ లోని స్థానిక విశ్వనాధ్ పేట కు చెందిన టిఆర్ఎస్ నేత, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్ ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడికి వచ్చిన ఒక బాలిక పై సాజిద్ ఖాన్ కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ బాలికను లొంగదీసుకోవాలని భావించిన సాజిద్ అన్నపూర్ణమ్మ అనే మహిళ ను రంగంలోకి దింపాడు. పక్కా ప్లాన్ ప్రకారం బాలిక జీవితాన్ని నాశనం చేశాడు.

బాలికపై హైదరాబాద్ లోని హోటల్ లో లైంగిక దాడి

బాలికపై హైదరాబాద్ లోని హోటల్ లో లైంగిక దాడి


నిజామాబాద్ వెళుతున్నానని, తనతోపాటు తోడు రావాలని బాలికను నమ్మించి బయలుదేరిన మహిళ అన్నపూర్ణమ్మ , హైదరాబాదులో మంచి దావత్ ఉందని, సాయంత్రానికల్లా తిరిగి వచ్చేద్దామని చెప్పి బాలికను హైదరాబాద్ కి తీసుకు వెళ్ళింది. అక్కడ అప్పటికే చార్మినార్ సమీపంలో హోటల్ లో బస చేసిన సాజిద్ ఖాన్ కు బాలికను అప్పగించింది. దీంతో సాజిద్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు పలు ప్రదేశాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడి చేశాడు.

బాలికకు బెదిరింపులు, అయినా తల్లిదండ్రులకు చెప్పిన బాలిక, కేసు నమోదు

బాలికకు బెదిరింపులు, అయినా తల్లిదండ్రులకు చెప్పిన బాలిక, కేసు నమోదు


పోలీసుల వద్దకు వెళ్లవద్దని, ఎవరికీ చెప్పొద్దని బెదిరించి తిరిగి ఇంటికి పంపించాడు. అయితే బాలిక తనపై జరిగిన లైంగిక దాడిపై తల్లిదండ్రులతో చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాజిద్ ఖాన్ పై పోక్సో చట్టం తో పాటుగా, అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను తీసుకువెళ్ళిన అన్నపూర్ణమ్మను, డ్రైవర్ ను కూడా నిందితులుగా పేర్కొన్నారు. నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆపై సఖి కేంద్రానికి చేర్చారు.

ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం, పార్టీ నుండి సప్సేండ్ చేసిన టీఆర్ఎస్

ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం, పార్టీ నుండి సప్సేండ్ చేసిన టీఆర్ఎస్


ఇక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ సాజిద్ ఖాన్ ను టిఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ ను టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు బాధితురాలికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+