ఫామ్ హౌస్ నిందితులతో యోగీ, కిషన్ రెడ్డి ? ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేసిన టీఆర్ఎస్
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల వద్దకు ముగ్గురిని పంపి డబ్బులు, పదవులు ఇస్తామని ప్రలోభాలు పెట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు స్వామీజీలు, మరో హోటల్ ఓనర్ ఉన్నారు. అయితే వీరు కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో గతంలో దిగిన ఫోటోల్ని టీఆర్ఎస్ షేర్ చేసింది.
నిన్న రాత్రి ఎస్.వో.టీ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హోటల్ ఓనర్ నందకుమార్ తో పాటు సింహయాజి, రామచంద్రభారతి ఉన్నారు. వీరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సన్నిహితుడైన రామచంద్రభారతి వీరితో కలిసి ఉన్న ఫోటోల్ని టీఆర్ఎస్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అలాగే నందకుమార్ కూడా కిషన్ రెడ్డితో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఫామ్ హౌస్ నిందితులతో బ్రోకర్ బీజేపీ బంధానికి సాక్ష్యాలు ఇవేనంటూ టీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్ ఓ ఈ ఫోటోల్ని పెట్టింది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిన ముగ్గురితో తమకేం సంబంధం అంటూ బీజేపీ నేతలు బుకాయిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ విడుదల చేసిన ఫోటోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఫోటోల్ని ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు కూడా తమ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేస్తున్నారు.తద్వారా బీజేపీ ఎదురుదాడికి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
బ్రోకర్ బీజేపీ బంధానికి సాక్ష్యాలు
— TRS Party (@trspartyonline) October 27, 2022
- కేంద్ర మంత్రి అమిత్షా, యూపీ సీఎం యోగీకి సన్నిహితుడు రామచంద్ర భారతి… రెండో స్వామి ప్రపన్న శ్రీకరుణాకరన్ వెంకటనాథ సింహయాజి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో.. ఏపీ, తెలంగాణల్లోని బీజేపీ నేతలతో ఈయనకు దగ్గరి సంబంధాలు
1/2#TelanganaNotForSale pic.twitter.com/B9cLV322nL
ఈ ట్వీట్ లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను డబ్బు సంచులతో ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసి తద్వారా ఫిరాయింపులకు తన అనుయాయుల ద్వారా ప్రయత్నించారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైందని టీఆర్ఎస్ పేర్కొంది. బీజేపీ బొక్క బోర్లా పడిందని... కమలం ఆపరేషన్ ఆకర్ష్ వికటించిందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చి తద్వారా రాజకీయ లబ్ది పొందాలన్న బీజేపీకి ఆదిలోనే హంసపాదు పడినట్లయిందని టీఆర్ఎస్ తన ట్వీట్‌లో వెల్లడించింది.
ఎమ్మెల్యేలను కొంటామని సిగ్గులేకుండా బహిరంగంగానే ప్రకటించిన బీజేపీ నాయకులు.#TelanganaNotForSale pic.twitter.com/b65wHJkck5
— TRS Party (@trspartyonline) October 27, 2022












Click it and Unblock the Notifications