వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ స్కెచ్: పార్లమెంట్ సమావేశాలకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ రెడీ!!

|
Google Oneindia TeluguNews

నవంబర్ 29వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో వైసిపి ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ పార్టీ కసరత్తు చేస్తుందా? శీతాకాల పార్లమెంటు సమావేశాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నారా? ఈ మేరకు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ ఎంపీలకు కీలక ఆదేశాలు జారీ చేయనున్న రా? ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇందిరా పార్క్ వేదికగా మోదీ సర్కారు తీరును నిరసిస్తూ మహా ధర్నా చేసిన సీఎం కేసీఆర్ పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ


తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌లో జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పార్లమెంట్‌లో లేవనెత్తాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించి దిశానిర్దేశం చేస్తున్నారు.

అజెండా అంశాలు ఇవే.. ధాన్యం కొనుగోళ్ళపై పార్లమెంట్ వేదికగా సమరం

అజెండా అంశాలు ఇవే.. ధాన్యం కొనుగోళ్ళపై పార్లమెంట్ వేదికగా సమరం

ముఖ్యంగా రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్ళు, నదీజలాల పంపిణీ, పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల మంజూరు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పెండింగ్‌ నిధుల విడుదల, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, అజెండాలోని అంశాలుగా చర్చిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి, వ్యవసాయ చట్టాలు ఉపసంహరణ, మద్దతు ధర, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు తదితర అంశాలపై పార్టీ వైఖరిని, పార్లమెంటులో లేవనెత్తాల్సిన తీరును సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై విరుచుకుపడనున్న టీఆర్ఎస్ ఎంపీలు

పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై విరుచుకుపడనున్న టీఆర్ఎస్ ఎంపీలు


ఇప్పటికే కేంద్రంపై యుద్ధం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు సాగుచేస్తున్న వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసి తీరాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందిరా పార్క్ వేదికగా మహా ధర్నా నిర్వహించి కేసీఆర్ దీక్షలో పాల్గొని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. ఆపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ కావాలని భావించిన కేసీఆర్ కు మోడీ అపాయింట్మెంటు దొరక్కపోవడం కూడా చర్చనీయాంశమైంది. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్ ఈ సారి పార్లమెంట్ సమావేశాలను తెలంగాణా రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఎత్తి చూపే వేదికగా మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు

మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు

ఇక మరో పక్క ధాన్యం కొనుగోళ్ళు కొనసాగుతాయని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిలిపివేసిందనే ప్రచారం అసత్య ప్రచారమని కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ శనివారం నాడు కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక దీంతో సీఎం కేసీఆర్ మరింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా రైతుల ధాన్యం కొనకుండా, కొంటున్నామని చెప్పటంపై టీఆర్ఎస్ ఇప్పటికే మండిపడుతుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి ధాన్యం కొనుగోలు విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని, ఆ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారని సమాచారం.

English summary
TRS sketch for parliamentary sessions; KCR strategy targeting Modi government. paddy procurement from the state, distribution of river water, funding for pending projects, release of pending funds are being discussed as items on the agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X