సభలో అక్బర్ కథ, వెయిట్ చేసిన సురేఖ (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో కల్తీ పాల విక్రయాల అమ్మకాలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ పాల ఉత్పత్తులను నిషేధించాలని తెరాస డిమాండ్ చేయడంతో శాసనసభలో బుధవారం పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.

హెరిటేజ్ పాల ఉత్పత్తులను నిషేధించాలని తెరాస ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి డిమాండ్ చేయడం, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ తొత్తుల మాదిరిగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీ రామారావు ఆక్షేపించడంతో సభలో దుమారం రేగింది.

ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన తెదేపా సభ్యులు తమను విమర్శించిన వారికి జవాబు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. అదే సమయంలో సర్వేలో ఎంపీ కల్వకుంట్ల కవిత రెండుచోట్ల వివరాలు ఇచ్చారన్న రేవంత్ క్షమాపణ చెప్పాలని తెరాస పట్టుబట్టింది. ఈ గందరగోళం మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది.

రేవంత్

రేవంత్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి దృశ్యం.

కేటీఆర్

కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దృశ్యం.

అక్బర్

అక్బర్

మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ సభలో పిట్ట కథ చెప్పి ఆకట్టుకున్నారు. ఓసారి చక్రవర్తి వద్దకు ఓ గాయకుడు వచ్చి శ్రావ్యంగా పాడారని, అది ఆఖట్టుకుందని, బహుమతిగా కొంత నగదు ప్రకటించారని, గాయకుడు మరో పాట పాడగా రెడోసారి బంగారం, వెండి ప్రకటించారన,ి ఇలా గాయకుడు పాట పాడటం, రాజు ప్రకటించడం జరిగిందని చెప్పాడు.

అక్బర్

అక్బర్

సంతోషంగా ఇంటికి వెళ్లిన గాయకుడు బహుమతుల కోసం వారం పాటు చూసినా రాకపోవడంతో.. రాజు వద్దకు వెళ్లి అడిగాడని, దానికి రాజు ఆశ్చర్యపోయే సమాధానం చెప్పారన్నాడు. నీ పాటల ద్వారా నాకు శ్రవణానందం కలిగించావు.. నీకు నజరానాలు ప్రకటించి అనందం కలిగించాను.. అంతేనని వ్యాఖ్యానించాడని, రాష్ట్ర బడ్జెట్ కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.

కొండా సురేఖ

కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ దృశ్యం.

హరీష్ రావు

హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేత, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దృశ్యం.

లక్ష్మణ్

లక్ష్మణ్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలో బుధవారం నాడు మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ దృశ్యం.

మీడియా పాయింట్

మీడియా పాయింట్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలోని మీడియా పాయింట్ వద్ద తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడుతుండగా నిరీక్షిస్తున్న తెరాస మహిళా ఎమ్మెల్యేలు.

మీడియా పాయింట్

మీడియా పాయింట్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, తదితరులు.

మీడియా పాయింట్

మీడియా పాయింట్

తెలంగాణ రాష్ట్ర శాసన సభలోని మీడియా పాయింట్ వద్ద తెరాస నేతలు మాట్లాడి వెళ్తుండగా.. మాట్లాడేందుకు వెళ్తున్న తెలంగాణ టీడీపీ నేతలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+