త్వరలో టీఆర్ఎస్ రెండు ముక్కలవుతుంది..? కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలనం
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో అధికార పార్టీలో చీలక రాబోతుందని జోస్యం చెప్పారు. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం జరగబోతుందని హింట్ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమయ్యాయి.
సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. కేసీఆర్ లాంటి నేతలు చాలా మంది వచ్చారు.. వెళ్లారని గుర్తుచేశారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు కాబోతుందని జోస్యం చెప్పారు. దీనికి నిదర్శనం ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలని ఉదహరించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.

కేసీఆర్ అవినీతి, అరాచకాలపై విచారణ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మిత్రులేనని .. అందుకే కేసీఆర్‌ను చూసీ చూడనట్టు వదిలేశారని కేంద్రంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరూ నియంతలేనని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications