'సిద్దిపేట' టిఆర్ఎస్ కైవసం.. ఐనా హరీష్‌కు షాక్, బిజెపి-కాంగ్రెస్ గెలుపు
సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పురిటిగడ్డ సిద్దిపేటలో ఆ పార్టీకి ఒకింత షాక్ తగిలింది. వరుస ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న టిఆర్ఎస్ పార్టీ సిద్దిపేటలో మున్సిపాలిటీని కైవసం చేసుకున్నప్పటికీ.. ఒకింత చతికిలపడింది.
సిద్దిపేట మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు సోమవారం నాడు జరిగింది. సిద్దిపేటలో 34 వార్డులు ఉన్నాయి. ఇందులో 22 మాత్రమే తెరాస గెలిచింది. రెండు వార్డుల్లో కాంగ్రెస్, మరో రెండు వార్డుల్లో బిజెపి గెలిచింది. 33వ వార్డులో మజ్లిస్ పార్టీ గెలిచింది. ఏడుగురు రెబల్స్ లేదా స్వతంత్రులు గెలుపొందారు. గెలుపొందిన స్వతంత్రుల్లో ఒకరు టిడిపి వారు. మిగతా ఆరుగురు టిఆర్ఎస్ రెబల్స్.

మొత్తానికి సిద్దిపేట మున్సిపాలిటీని టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే వరంగల్ ఉప ఎన్నికలు, మెదక్ ఉప ఎన్నికలు, మొన్న వరంగల్, ఖమ్మం, అచ్చంపేట స్థానిక ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అచ్చంపేటలో అయితే సీట్లన్నీ తెరాసనే గెలుచుకుంది.
అయితే, తెరాస పురిటిగడ్డ అయిన సిద్దిపేటలో, అదీ మంత్రి హరీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో 34 వార్డులకు గాను కేవలం 22 గెలుచుకోవడం ఓ విధంగా హరీష్ రావుకు ఎదురు దెబ్బేనని, అలాగే తెరాసకు ఎదురు దెబ్బేనని అంటున్నారు.
అభ్యర్థుల ఎంపిక విషయంలో తప్పిదం తెరాసకు పూర్తి సానుకూలంగా రాకపోవడానికి కారణమని అంటున్నారు. తెరాస నుంచి అభ్యర్థులు ఎక్కువ మంది టిక్కెట్ ఆశించడం, టిక్కెట్ రాని వారు రెబల్స్‌గా బరిలోకి దిగడం, స్థానిక అభ్యర్థుల పైన కొంత వ్యతిరేకత ఉండటం కారణంగా స్వతంత్రులు, ఇతర పార్టీలు, రెబల్స్ గెలిచారని అంటున్నారు.












Click it and Unblock the Notifications