టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత, టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య
హైదరాబాద్: ఫ్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్శిటీ గార్డెన్ లో మహిపాల్ రెడ్డి అనే టిఆర్ఎస్ కార్యకర్త ఆదివారం నాడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లికి చెందిన టిఆర్ఎస్ కార్యక్త మహిపాల్ రెడ్డి వాకింగ్ వెళ్తానని చెప్పి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టిడిపి నుండి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
టిఆర్ఎస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని మహిపాల్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. టిడిపికి వ్యతిరేకంగా పార్టీని బలోపేతం చేసేందుకు తాను ఏ రకంగా పనిచేశానో ఆయన ఆ లేఖలో రాశాడు.

అయితే ఇటీవల జరిగిన కార్పోరేటర్ల ఎన్నికలను కూడ ఆయన ప్రస్తావించారు.అయితే టిడిపి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను పార్టీలో చేర్చుకోవడం వల్ల వారి కిందనే తాము పనిచేయాల్సి వస్తోందన్నారు.అంతేకాదు తమకు న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు ఉదయంపూట వాకింగ్ వచ్చిన కొందరు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.అయితే మృతదేహంలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.












Click it and Unblock the Notifications