కేసీఆర్ ఒక జోకర్.. కాంగ్రెస్‌ను తిడితే నొప్పెందుకు ? : టీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. రాజ్యసభలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలను మోదీ అవమానపరిచారంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలకు దిగాయి.కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
Recommended Video

తెలంగాణ బిల్లు పెట్టిన్నప్పుడు కేసీఆర్ ఎక్కడ..
ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని తిడితే టీఆర్ఎస్ పార్టీ నేతలకు నొప్పెందుకు పుడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మోదీ తెలంగాణ రాష్ట్ర బిల్లును అడ్డుకున్నారా.. వ్యతిరేకించారా..? అని ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన్నప్పుడు కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే కొట్టింది కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు. పెప్పర్ స్ప్రే కొట్టినా పారిపోకుండా.. తెలంగాణ బిల్లు కోసం నిలబడింది సుష్మాస్వరాజ్ అని బండి సంజయ్ గుర్తు చేశారు.

టీఆర్ఎస్‌కి డౌన్ ఫాల్ ప్రారంభమైంది..
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు టీఆర్ఎస్ పార్టీకి డౌన్ ఫాల్ ప్రారంభమైందని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద జోకర్ లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలపై ప్రజల దృష్టిని మరలించేందుకు టీఆర్ఎస్ రోజుకో కొత్త డ్రామాలు అడుతుందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ కు ఇంట్రస్ట్ లేదని ఆరోపించారు. అసులు కేసీఆర్ మంత్రివర్గంలో ఎంత మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహులకు తన కేబినెట్ లో పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ ప్రధాన అస్త్రం
తెలంగాణలో తమకు కేసీఆర్ ప్రధాన అస్త్రం అన్నారు బండి సంజయ్. భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలి అని చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగంతో వచ్చిన ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ ఇప్పటికి వరకు చెప్పలేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతల డ్రామాలు ఇక ప్రజలు నమ్మరు అని గుర్తుకు పెట్టుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని, గుణపాఠం చెప్పితీరతామని హెచ్చరించారు.

కేసీఆర్ పాలనపై ప్రజల తిరుగుబాటు
కేసీఆర్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరపడ్డాయని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ , ఆయన కుటుంబం ఏం చేసిందన్నారు. ఏనాడైనా లాఠీ దెబ్బలు తిన్నారా..? జెలుకు వెళ్లారా? అని నిలదీశారు. పక్కరాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా మాట్లాడడం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫాం హౌస్ లో పండుకున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనతో ప్రజలు రగిలిపోతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications