ఎంసెట్-3 ఫలితాలు విడుదల: ఆంధ్ర అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్
హైదరాబాద్: తెలంగాణలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఎంసెట్-3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను గురవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్-3 పరీక్షలో మొత్తం 8 తప్పులు దొర్లాయని చెప్పారు.

8 ప్రశ్నల్లో ఏడింటికి సమాధానాలు లేవని తేల్చి చెప్పారు. ఎంసెట్-3 రాసిన అందరికీ 8 మార్కులు కలుపుతామని ఆయన తెలిపారు. మరో ప్రశ్న సిలబస్‌లో లేదని అన్నారు. ఇక ఎంసెట్-3 పరీక్షకు 40,500 మంది విద్యార్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోగా.. 37,199 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఎంసెట్-3 ఫలితాలను tseamcet లేదా jntuh వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఎంసెట్-3లో కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మానస అనే అమ్మాయి ప్రథమ స్థానంలో నలిచింది.
ఎంసెట్-3 ర్యాంకర్లు వీరే:
ఫస్ట్ ర్యాంక్ - రేగళ్ల మానస (152) గుడివాడ
రెండో ర్యాంక్ - హారిక (151) సికింద్రాబాద్
మూడో ర్యాంకు - తేజస్విన్ (151) అనంతపురం
నాలుగో ర్యాంక్ - జీషన్ అహ్మాద్ (151) హైదరాబాద్
ఐదో ర్యాంక్ - విక్రమ్ ఖాన్ (151) హైదరాబాద్












Click it and Unblock the Notifications